'పోలీసులే తప్పు చేస్తే ఎవరిని అడగాలి?'.. లోకేశ్ కనగరాజ్ యాక్షన్ థ్రిల్లర్ 'డీసీ' ట్రైలర్ రిలీజ్!

 'పోలీసులే తప్పు చేస్తే ఎవరిని అడగాలి?'.. లోకేశ్ కనగరాజ్ యాక్షన్ థ్రిల్లర్ 'డీసీ' ట్రైలర్ రిలీజ్!

తమిళ స్టార్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ హీరోగా నటించిన తొలి చిత్రం 'డీసీ'(DC The Bloody Valentine) విడుదలకు సిద్ధమవుతోంది. 'రాకీ'. 'సాని కాయిదం', 'కెప్టెన్ మిల్లర్' చిత్రాలతో తన ప్రత్యేక మేకింగ్‌ను నిరూపించుకున్న అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

"తప్పు చేస్తే దండించడానికి పోలీసులు వస్తారు... కానీ పోలీసులే తప్పు చేస్తే ఎవరిని అడగాలి?" అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో మొదలయ్యే ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠను పంచుతోంది. దేవదాస్ పాత్రలో లోకేశ్ కనగరాజ్ తన ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంటోంది. చంద్ర పాత్రలో వామికా గబ్బీ అద్భుతంగా కనిపించింది. ఒక పోలీసు హత్య తర్వాత ప్రతీకారంతో వెంబడించే పోలీస్ ఆఫీసర్.. దొంగిలించిన ఆయుధాల చుట్టూ తిరిగే గ్యాంగ్, ప్రేమ, ద్రోహం, రక్తపాతం... ఇవన్నీ కలిసిన కథగా 'డీసీ'ఉండబోతుందని ట్రైలర్ స్పష్టం చేసింది.

 

ఈ చిత్రంలో సంజనా కృష్ణమూర్తి కీలక పాత్రలో నటించారు. అరుణ్ మాథేశ్వరన్‌తో కలిసి ఫ్రాంక్లిన్ జేకబ్ డైలాగ్స్ రాశారు. అదనపు స్క్రీన్‌ప్లేను అరుణ్ రంజన్ అందించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు భారీ హైలైట్‌గా నిలిచింది. ఇటీవల విడుదలైన 15 ట్రాక్‌ల ఆల్బమ్‌కు కూడా మంచి స్పందన లభిస్తోంది.

►ALSO READ | I Am Game Trailer : 'ఐ యామ్ గేమ్' ట్రైలర్ రిలీజ్.. స్టైలిష్ యాక్షన్‌తో అదరగొట్టిన దుల్కర్ సల్మాన్!

ముకేష్ జీ సినిమాటోగ్రఫీ, జి.కె. ప్రసన్న ఎడిటింగ్, పీసీ స్టంట్స్ రూపొందించిన యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లేలా కనిపిస్తున్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కలానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఉత్తర భారతంలో ధర్మ ప్రొడక్షన్స్ విడుదల చేయనుంది. దర్శకుడిగా బ్లాక్‌బస్టర్లు అందించిన లోకేశ్ కనగరాజ్, హీరోగా కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడా లేదా అన్న ఆసక్తి ఇప్పుడు సినీ అభిమానుల్లో నెలకొంది.