I Am Game Trailer : 'ఐ యామ్ గేమ్' ట్రైలర్ రిలీజ్.. స్టైలిష్ యాక్షన్‌తో అదరగొట్టిన దుల్కర్ సల్మాన్!

I Am Game Trailer : 'ఐ యామ్ గేమ్' ట్రైలర్ రిలీజ్.. స్టైలిష్ యాక్షన్‌తో అదరగొట్టిన దుల్కర్ సల్మాన్!

కోలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఐ యామ్ గేమ్' విడుదలకు సిద్ధం అవుతోంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ను  లేటెస్ట్ గా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ  ట్రైలర్‌ను చూస్తే ఇది సాధారణ యాక్షన్ సినిమా కాదని, స్టైలిష్ విజువల్స్, హాలీవుడ్ స్థాయి ఛేజ్ సీక్వెన్స్‌లు, పవర్‌ఫుల్ యాక్షన్ బ్లాక్‌లతో రూపొందిన హై-ఆక్టేన్ థ్రిల్లర్ అని స్పష్టమవుతోంది. మలయాళ సినీ పరిశ్రమలో ఇప్పటివరకు చూడని స్థాయిలో యాక్షన్‌ను ఈ చిత్రం ఆవిష్కరించబోతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ పూర్తి మాస్, అల్ట్రా-స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నాడు. అతని స్క్రీన్ ప్రెజెన్స్, స్టైలిష్ మేకోవర్, పంచ్ డైలాగ్స్, ఎనర్జిటిక్ బాడీ లాంగ్వేజ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ చివర్లో వచ్చే ట్విస్టులు సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఆగస్టు 20న ఓణం కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతూ అభిమానులను ఫిదా చేస్తోంది.

►ALSO READ | Mahesh Babu: విష్ణుమూర్తిగా మహేష్ బాబు? ఫ్యాన్స్‌ను కన్ఫూజన్‌లో పెట్టిన 'రామాయణ' టీమ్!

దుల్కర్ సల్మాన్‌కు చెందిన వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. 'ఆర్‌డీఎక్స్' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నహాస్ హిదాయత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.. సజీర్ బాబా, ఇస్మాయిల్ అబూబక్కర్, బిలాల్ మొయిదు కథ, స్క్రీన్‌ప్లే అందించగా, డైలాగ్స్‌ను సజీర్ బాబా, ఆదర్శ్ సుకుమారన్, షబాస్ రషీద్ రచించారు.

ఆంటోని వర్గీస్, మైస్కిన్, కాయదు లోహర్, కథిర్, పార్థ్ తివారి, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రల్లో నటించారు.  జేక్స్ బిజోయ్ అందించిన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, జిమ్షి ఖలీద్ సినిమాటోగ్రఫీ, అన్‌బరివ్ మాస్టర్స్ కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దక్షిణ భారతదేశంలోని 100కుపైగా లొకేషన్లలో చిత్రీకరించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.