సిదిరి అప్పలరాజుతో జగన్ ములాఖత్ నిరాకరణ

సిదిరి అప్పలరాజుతో జగన్ ములాఖత్ నిరాకరణ

శ్రీకాకుళం జైలులో ఉన్న వైసీపీ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును జైలులో కలిసేందుకు వెళ్లిన పార్టీ అధ్యక్షుడు జగన్ కు నిరాశ ఎదురైంది. ములాఖత్ సమయం ముగిసిందని.. ములాఖత్ ఇవ్వలేమని జైలు అధికారులు వెల్లడించారు. ములాఖత్ సమయం సాయంత్రం 5 గంటలకే ముగుస్తుందని.. సమయం దాటిన తర్వాత వచ్చారంటూ జగన్ ములాఖత్ ను నిరాకరించారు అధికారులు. 

శ్రీకాకుళంలోని జైలులో ఉన్న సిదిరి అప్పలరాజును కలిసేందుకు విజయవాడ నుంచి వైజాగ్ వరకు విమానంలో వెళ్లిన జగన్.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం చేరుకున్నారు. వైజాగ్ నుంచి 100 కిలోమీటర్లుపైనే ఉన్న రోడ్డు మార్గంలో.. అడుగడుగునా జనం, అభిమానులు స్వాగతం పలికారు. 

►ALSO READ | ప్రపంచ పెద్దపులుల దినోత్సవం రోజే విషాదం: నంద్యాల జిల్లాలో పెద్దపులి మృతి

కాన్వాయ్ కు జనం ఎదురు రావటం.. జగన్ ను చూసేందుకు.. కలిసేందుకు ఎగబడటంతో.. అక్కడక్కడ ఆగాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే శ్రీకాకుళం వెళ్లటానికి చాలా సమయం పట్టింది. 100 కిలోమీటర్ల జాతీయ రహదారిపై వెళ్లటానికి 5 గంటల సమయం పట్టటం.. ఈలోపు ములాఖత్ సమయం ముగిసిపోవటంతో.. జైలు అధికారులు అనుమతి ఇవ్వలేదు.