రాంచీ: జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. చత్రా జిల్లాలో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఎయిర్ అంబులెన్స్ సోమవారం (ఫిబ్రవరి 23) రాత్రి రాంచీ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో విమానంలో ఏడుగురు వ్యక్తులు ఉన్నారు. -ఒక రోగి, వైద్యుడు, ఒక పారామెడిక్, ఇద్దరు సహాయకులు, ఒక పైలట్-ఇన్-కమాండ్ (PIC), ఒక కో-పైలట్.
సమాచారం అందిన వెంటనే ఛత్రా జిల్లా యంత్రాంగం సెర్చ్, రెస్క్యూ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. మరణించిన వ్యక్తిని 41 ఏళ్ల సంజయ్ కుమార్‌గా గుర్తించారు. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) బృందం ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
