చిన్న సినిమాగా కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం కథ, కథనం, విజువల్స్‌తో ప్రేక్షకులను ముగ్ధులను చేసింది. సూపర్ హీరో కాన్సెప్ట్కి హిందూ మైథాలజీని లింక్ చేసి ప్రేక్షకులను సరికొత్త లోకంలోకి తీసుకెళ్లాడు ప్రశాంత్ వర్మ.
హనుమాన్ సినిమాను తీర్చిదిద్దిన విధానం, క్లైమాక్స్లో హనుమాన్ ను క్రియేట్ చేసిన విధానానికి ప్రేక్షకులు మంత్రముగ్దులు అయిపోయారు. సాక్షాత్తు హనుమంతుల వారిని చూసిన అనుభూతితో చాలా మంది చేతులెత్తి నమస్కారం చేశారు. అంతలా ఆడియన్స్ ను కట్టిపడేశాడు ప్రశాంత్. ఇక సినిమా చివర్లో హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ ఉంటుందని ప్రకటించి సర్ప్రైజ్ ఇచ్చాడు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు ఆడియన్స్.
2024 సంక్రాంతి కానుకగా జై హనుమాన్ కథ పూర్తయిందని, త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయనే అప్డేట్ ఇచ్చి ఆడియన్స్ ను ఖుషీ చేశాడు. దాంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఎట్టకేలకు జై హనుమాన్ షురూ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.
Beginning #JaiHanuman at the birthplace of Lord Hanuman ✨
— Mythri Movie Makers (@MythriOfficial) February 22, 2026
A pooja ceremony was held at Anjanadri Betta near Hampi, with the team in attendance ❤️ #BhushanKumar gave the clap for the first shot while #AnilThadani switched on the camera, as ‘Hanuman’ star @tejasajja123 directed… pic.twitter.com/Aaq8Bh4fQi
జై హనుమాన్ ప్రారంభం:
హనుమాన్ క్లైమాక్స్ లోనే సీక్వెల్‌గా జై హనుమాన్ వస్తుందని ప్రకటించడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. 2024 లో కథ సిద్ధమై, ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయని ప్రకటించిన దర్శకుడు, ఇవాళ (ఫిబ్రవరి 22న) పూజా కార్యక్రమాలతో సినిమాను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ వేడుక అంజనాద్రి బెట్టలో జరిగింది. కార్యక్రమంలో రిషబ్ శెట్టి దంపతులు, తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
#Hanuman sequel, #JaiHanuman, launched today at Anjanadri Betta.#RishabShetty, #PrasanthVarma, #TejaSajja and the team were present at the pooja ceremony pic.twitter.com/NBpgL47WPg
— Journalist Ramesh Pammy (@rameshpammy) February 22, 2026
సీక్వెల్ కథ & నటీనటులు
శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి? దాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన చేసిన త్యాగాలు, ప్రయాణం ఏమిటి? అనే ఆసక్తికరమైన కథాంశంతో జై హనుమాన్ రూపొందుతోంది. ఆంజనేయ స్వామి పాత్రలో: రిషబ్ శెట్టి, హనుమంత్ పాత్రలో: తేజ సజ్జా, మరో కీలక పాత్రలో రానా దగ్గుబాటి నటించే అవకాశముంది. భక్తి, శక్తి, భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందుతున్న జై హనుమాన్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
In the spirit of Diwali and the guiding light of the divine ✨
— Prasanth Varma (@PrasanthVarma) October 30, 2024
Honoured to be teaming up with the National Award-winning actor @shetty_rishab sir and the prestigious @MythriOfficial to bring our grand vision #JaiHanuman 🙏🏽
Let’s begin this DIWALI with the holy chant JAI HANUMAN… pic.twitter.com/i2ExPsflt2
