T20 World Cup: జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించిన వెస్టిండీస్.. స్కోర్ ఎంతంటే..? 

T20 World Cup: జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించిన వెస్టిండీస్.. స్కోర్ ఎంతంటే..? 

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సూపర్–8లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్ లో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. ఇక తొలుత బ్యాటింగ్ కి వచ్చిన విండీస్ బ్యాటర్లు పసికూన బౌలర్లకు చుక్కలు చూపించారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన కరేబియన్ బ్యాటర్లు ఫోర్లు, సిక్సులు కొట్టి జింబాబ్వే ముందు భారీ లక్ష్యాన్ని పెట్టారు. 

మొదట బ్యాటింగ్ కి దిగిన వెస్టిండీస్ ఓపెనింగ్ బ్యాటర్లు త్వరగానే ఔట్ అయ్యారు.  రిచర్డ్ నగరావా  వేసిన ఓవర్లో భారీ షాట్ ఆడబోయి తషింగా ముసెకివాకి క్యాచ్ ఇచ్చి బ్రాండన్ కింగ్ (9) పెవిలియన్ బాట పట్టగా, 5వ ఓవర్ వేసిన బ్రాడ్ ఎవాన్స్ బౌలింగ్ లో బ్రియాన్ బెన్నెట్ కి క్యాచ్ ఇచ్చి వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ (14) కూడా ఎక్కువ సేపు క్రీజుల నిలవలేదు.. అనంతరం క్రీజులోకి వచ్చిన షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్ ఆడిన బ్యాటింగ్ కి జింబాబ్వే బౌలర్లకు చుక్కలు కనిపించాయి. అయితే T20 వరల్డ్ కప్ హిస్టరీలోనే ఇది రెండవ అత్యధిక స్కోర్..

షిమ్రాన్ హెట్మెయర్ 34 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్సులతో ఏకంగా 85 పరుగులు చేసి సెంచరీ వైపు అడుగులు వేస్తుండగా గ్రేమ్ క్రీమర్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడగా బ్రియాన్ బెన్నెట్ క్యాచ్ పట్టుకోవడంతో పెవిలియన్ బాట పట్టాడు హెట్మెయర్. అనంతరం రోవ్‌మన్ పావెల్ 35 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 59 పరుగులు చేసి బ్లెస్సింగ్ ముజారబానీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన రొమారియో షెపర్డ్ 10 బంతుల్లో మూడు సిక్సులతో 21 పరుగులు చేసి బ్లెస్సింగ్ ముజారబానీ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. జాసన్ హోల్డర్ (13) చివరి ఓవర్ మొదటి రెండు బంతులను సిక్సులుగా మలిచిన మూడో బంతికి ముజారబానీ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయి పెవిలియన్ బాట పట్టాడు. చివర్ ఓవర్లోని లాస్ట్ బాల్ కి ఫోర్ కొట్టిన షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ 31 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ చెరో రెండు వికెట్ల తీసుకోగా, బ్రాడ్ ఎవాన్స్, గ్రేమ్ క్రీమర్ తలో వికెట్ తీసుకున్నారు.