హైదరాబాద్‌ మెట్రోను L&T నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్‌ మెట్రోను L&T నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పేరును డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌(TVVP) ఉద్యోగులు ఇకపై ప్రభుత్వ పరిధిలోకి రానున్నారు.

హైదరాబాద్‌ మెట్రోను L&T నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. మహబూబాబాద్ జిల్లా గుమ్మడూరులో JNTU కాలేజీ నిర్మాణానికి 70 ఎకరాలను కేటాయించింది. ఖమ్మంలో టీటీడీకి 20 ఎకరాల భూమి కేటాయించింది. కాంగ్రెస్‌ ఆఫీసులకు జిల్లాల్లో భూ కేటాయింపులకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.