డొమెస్టిక్ వర్కర్స్ డిమాండ్స్ న్యాయమైనవే.. చట్టపరంగా న్యాయం చేస్తం: మంత్రి వివేక్

డొమెస్టిక్ వర్కర్స్ డిమాండ్స్ న్యాయమైనవే.. చట్టపరంగా న్యాయం చేస్తం: మంత్రి వివేక్

హైదరాబాద్: డొమెస్టిక్ వర్కర్స్‎కి చట్టపరంగా న్యాయం చేస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. మంగళవారం (జూన్ 16) అబిడ్స్‎లో అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డొమెస్టిక్ వర్కర్ల సమస్యలు తీర్చడానికి త్వరలోనే ఒక కమిటీని వేస్తామని తెలిపారు. 

విదేశాల్లో ఉన్న డొమెస్టిక్ వర్కర్స్ చట్టాలను కూడా చూడాలని పేర్కొన్నారు. తెలంగాణలో డొమెస్టిక్ వర్కర్స్ చేసిన డిమాండ్స్ న్యాయమైనవేనని అన్నారు. డొమెస్టిక్ వర్కర్ల కష్టాలను తీర్చడానికి నా వంతు బాధ్యతగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. దేశంలో మొదటిసారిగా కోల్ వర్కర్స్‎కి పెన్షన్ తీసుకురావడoలో మా నాన్న కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. 

మా నాన్నగారికి వచ్చిన అవకాశాలే ఇప్పుడు నాకు వస్తున్నాయన్నారు. డిమాండ్ల సాధన కోసం గిగ్ వర్కర్స్ 15 సంవత్సరాలు పోరాటం చేశారని.. వాళ్ల చేసిన పోరాటానికి ఫలితంగా ఇటీవల చట్టం వచ్చిందని అన్నారు. గృహ కార్మికులు సుమారు 14 గంటలు పని చేస్తారని అన్నారు. గృహ కార్మికులు ఉండటంవల్లే మేము బయట ప్రశాంతంగా వర్క్ చేసుకోగలుగుతున్నామని అన్నారు.