మాట నిలబెట్టుకున్న విజయ్ సర్కార్.. రుణ మాఫీపై కీలక ప్రకటన

మాట నిలబెట్టుకున్న విజయ్ సర్కార్.. రుణ మాఫీపై కీలక ప్రకటన

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులోని రైతన్నలకు ఊరట కల్పిస్తూ రుణ మాఫీ చేయాలని విజయ్ సర్కార్ నిర్ణయించింది. మే 1, 2025 నుంచి.. ఫిబ్రవరి 28, 2026 వరకు సహకార బ్యాంకుల నుంచి రైతులు వ్యవసాయం నిమిత్తం తీసుకున్న పంట రుణాలను 75 రూపాయల వరకు మాఫీ చేస్తున్నట్లు విజయ్ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ రుణ మాఫీ నిర్ణయంతో రైతులకు ఊరట కలిగింది. ఈ రుణ మాఫీ వల్ల తమిళనాడులో 14 లక్షల 43 వేల మంది రైతులకు లబ్ది చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వంపై 5 వేల 932 కోట్ల రూపాయల అదనపు వ్యయ భారం పడుతుంది. 75 వేల రూపాయలకు మించి రుణాలు తీసుకున్న రైతులకు 35 వేల రూపాయల వరకూ రుణ మాఫీ చేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.

►ALSO READ | బెంగళూరు ఆటో అన్నా.. మామూలోడు కాదు భయ్యా! చెయ్యి పైకెత్తాడు, పేమెంట్ అయిపోయింది!

సహకార బ్యాంకు రుణాలు తీసుకున్న చిన్న, సన్నకారు రైతులకు గత నెలలో రూ. 50,000 వరకు రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన క్రమంలో.. రైతుల నుంచి అందిన విజ్ఞప్తి మేరకు రుణ మాఫీని 50 వేల నుంచి 75 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సీఎం విజయ్ నేతృత్వంలో తమిళనాడులో మంగళవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో రైతు రుణ మాఫీ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే సాగు సీజన్ కోసం రుణాలు తీసుకునే రైతులకు ఈ పంట రుణ మాఫీ కాస్తంత ఊరట కలిగించింది.