శబరిమల భక్తులకు ట్రావన్‌కోర్ దేవస్వం బోర్డు అత్యవసర హెచ్చరిక

శబరిమల భక్తులకు ట్రావన్‌కోర్ దేవస్వం బోర్డు అత్యవసర హెచ్చరిక

తిరువనంతపురం: కేరళలోని పంపా ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉంది. నేపథ్యంలో శబరిమల భక్తులకు ట్రావన్‌కోర్ దేవస్వం బోర్డు అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. పంపాలో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆగస్ట్ 2, 3వ తేదీలలో నిరపుత్తరి (Niraputhari) దర్శనానికి శబరిమల వెళ్లాలని ప్రణాళిక వేసుకున్న భక్తులు తమ ప్రయాణాన్ని పునఃపరిశీలించాలని ఆలయ బోర్డ్ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం భద్రతా హెచ్చరిక (Security Alert) జారీ చేయబడినందున.. భక్తులు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరింది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు అనవసర ప్రయాణాలను నివారించాలని బోర్డు విజ్ఞప్తి చేసింది.