UPI కొత్త రికార్డు.. జులైలో రూ.29.88 లక్షల కోట్ల చెల్లింపులు

UPI కొత్త రికార్డు.. జులైలో రూ.29.88 లక్షల కోట్ల చెల్లింపులు

ఇండియాలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) అలవాటైన తర్వాత పాకెట్ లో క్యాష్  మెయింటైన్ చేయడం దాదాపుగా తగ్గిపోయింది కదా. టిఫిన్ చేసినా, కూరగాయలు తీసుకున్నా, బస్ టికెట్ కొన్నా.. ఏం చేసిన ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం.. ఇలా యూపీఐ పేమెంట్స్ చేయడమే దాదాపు అందరికీ అలవాటైపోయింది. అందుకేనేమో.. ఇండియాలో యూపీఐ రాను రాను రికార్డు స్థాయిలో ట్రాన్జాక్షన్స్ జరుగుతున్నాయి. 

జులై 2026లో యూపీఐ పేమెంట్స్ రికార్డు స్థాయిలో జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) పేర్కొంది.  యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీల విలువ రూ.29.88 లక్షల కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక నెలవారీ లావాదేవీల లెక్క ఇదేనని పేర్కొంది.

జులైలో మొత్తం 23.66 బిలియన్ (2,366 కోట్ల) లావాదేవీలు జరిగాయి. జూన్‌లో నమోదైన 22.72 బిలియన్ లావాదేవీల కంటే ఎక్కువ. గతేడాది జులైలో రూ.25.08 లక్షల కోట్లుగా ఉన్న లావాదేవీల విలువ ఈసారి 19 శాతం పెరిగి రూ.29.88 లక్షల కోట్లకు చేరింది.

మే 2026లో లావాదేవీల విలువ రూ.29.9 లక్షల కోట్లు ఉండగా, జులైలో కొద్దిగా తక్కువగా నమోదైనప్పటికీ ఇది అత్యధిక స్థాయిల్లోనే కొనసాగుతోంది.

పేనియర్‌బై మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఆనంద్ కుమార్ బజాజ్ మాట్లాడుతూ.. యూపీఐ ఇండియా డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థకు బలమైన పునాది వేస్తున్నట్లు చెప్పారు. జూలై 2026లో 23.66 బిలియన్ లావాదేవీలు, రూ.29.88 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు జరగటం అందుకు నిదర్శమని అన్నారు. ఇదే సమయంలో కస్టమరర్స్ నమ్మకం, అవేర్నెస్ పెంచడంపై దృష్టి పెట్టాలని అన్నారు.

ప్రస్తుతం యూపీఐ సుమారు 10 దేశాల్లో అందుబాటులో ఉంది. వీటిలో యుఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్, ఖతార్ వంటి దేశాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా విస్తరిస్తున్న యూపీఐ రెమిటెన్స్‌ను పెంచడంతో పాటు ఇండియాను  గ్లోబల్ ఫిన్‌టెక్ రంగంలో యూపీఐ బలోపేతం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.