హైదరాబాద్: ఎల్‌నినో కంటే డేంజర్‌గా సీఎం రేవంత్ రెడ్డి మారిండని మాజీ మంత్రి హరీష్రావు విమర్శించారు. ఆదివారం (సెప్టెంబర్ 20) యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరులో హరీష్ రావు సమక్షంలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో చాలా సర్వేలు జరుగుతున్నాయి. ఎన్నికలు పెడితే ఎవరు గెలుస్తారో సర్వే చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. పార్టీలో చేరికలతో మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలుస్తోందని ప్రజల్లో నమ్మకం వచ్చిందన్నారు.
రాష్ట్రంలో అరాచక పాలన
రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని హరీష్ రావు విమర్శించారు. కరెంట్ లో వోల్టేజీతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు ఇచ్చి రైతులను కేసీఆర్ ఆదుకుంటే.. రైతుబంధు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని మండిపడ్డారు. రైతు రుణమాఫీ, రైతుబీమా ఇవ్వడం లేదు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రేవంత్ రెడ్డి అరాచక పాలన వచ్చింది. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత కరెంట్ ఇవ్వడానికి ఇష్టం లేక కరెంట్ కోతలు పెడుతున్నారని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు ఎందుకు లాగ్‌బుక్‌లు చూడడం లేదని ప్రశ్నించారు.
22Aలో మోటకొండూరు భూములు కూడా పెట్టారు. నిషేధిత జాబితాలో పెట్టిన భూముల గురించి మేం కొట్లాడం. మేము ప్రజా సమస్యల గురించి పోరాడితే కేసులతో వేధించాలని చూస్తున్నారు. ఉద్యమం చేసి వచ్చిన వాళ్లం మేము. కేసులకు, బెదిరింపులకు భయపడము. ప్రజా సమస్యల కోసం పోరాడుతూనే ఉంటామని పేర్కొన్నారు.
ప్రజా సమస్యల కోసం పని చేయాల్సిన వాళ్లు.. ఫామ్‌హౌస్‌ల చుట్టూ తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నట్టు ఏ సబ్‌స్టేషన్‌లో చూపిస్తారో ఎంపీ చామల కిరణ్ కుమార్, బీర్ల ఐలయ్య రావాలని సవాల్ విసిరారు. కరోనా కాలంలో కూడా రైతులకు ఇబ్బంది కాకుండా కేసీఆర్ చూసుకున్నారన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని హెచ్చరించారు.
