బెంగళూరు సిటీ అంటేనే ఒక రేంజ్ టెక్నాలజీ, నెక్స్ట్ లెవెల్ స్టార్టప్ కల్చర్ గుర్తొస్తాయి కదా ! తాజాగా అక్కడ జరిగిన ఒక క్రేజీ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందిరానగర్ నుండి కోరమంగళకు ఆటోలో వెళ్లిన ఓ ప్యాసింజర్‌కు భలే ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఎదురైంది. అదేంటో మీరే చూడండి.....
అసలేం జరిగిందంటే..
ఆటో దిగాక ప్యాసింజర్ అలవాటు ప్రకారం.. “అన్నా, ఆన్‌లైన్ పేమెంట్ చేస్తా, క్యూఆర్ (QR) కోడ్ ఎక్కడుంది?” అని అడిగాడు. సాధారణంగా అయితే ఆటో డ్రైవర్లు ఫోన్ తీసి చూపిస్తారు లేదా ఆటోలో ఎక్కడో ఒకచోట స్టిక్కర్ అంటించి ఉంటుంది. కానీ, ఈ డ్రైవర్ మాత్రం అలా చేయలేదు. సైలెంట్‌గా అతని చేతి మణికట్టును పైకి ఎత్తాడు.
అంతే.. అతని స్మార్ట్‌వాచ్ స్క్రీన్‌పై క్యూఆర్ కోడ్ ప్రత్యక్షమైంది! ప్యాసింజర్ కూడా షాక్ అవుతూనే.. టక్కున దాన్ని స్కాన్ చేసి క్షణాల్లో పేమెంట్ చేసేసాడు.
ట్విట్టర్‌లో వైరల్ అయిన పోస్ట్
హేమంత్ అనే నెటిజన్ ఈ వింత అనుభవాన్ని Xలో షేర్ చేస్తూ.. ఈరోజు ఇందిరానగర్ నుండి కోరమంగళకు ఆటో ఎక్కా. డబ్బులు ఇవ్వడానికి క్యూఆర్ కోడ్ అడిగితే.. అతను చేతిని పైకి ఎత్తాడు, ఆ కోడ్ అతని స్మార్ట్‌వాచ్‌లో ఉంది అంటూ పోస్ట్ చేసాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. బెంగళూరు డిజిటల్ స్మార్ట్‌నెస్‌కు ఇదో సూపర్ ఎగ్జాంపుల్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
నెటిజన్ల క్రేజీ కామెంట్లు
ఈ వైరల్ పోస్ట్‌పై ఇంటర్నెట్ జనాల రెస్పాన్స్ మామూలుగా లేదు. కొందరు సరదాగా, మరికొందరు ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు. ఒక యూజర్.. నాకైతే కోరమంగళ, ఇందిరానగర్ ఆటో డ్రైవర్లు.. అక్కడ ఉండే ఐటీ ఎంప్లాయ్స్ కంటే ఎక్కువే సంపాదిస్తున్నట్టు అనిపిస్తోంది.. అని అనగా..
►ALSO READ | హనీమూన్కు వెళ్లిన కొత్త జంట : లాడ్జిలో నగ్నంగా రక్తపు మరకలతో భార్య.. ముస్సోరీలో ఏం జరిగింది..!
మరో యూజర్ ఇకపై క్లౌడ్ టెక్నాలజీ తెలిసిన ఐటీ వాళ్లంతా పార్ట్ టైమ్ జాబ్‌గా ఆటోలు నడపాలేమో అని అన్నారు. ఇంకో యూజర్.. నిజంగా భలే ఉంది ఐడియా.. నా బోట్ వాచ్‌లో కూడా క్యూఆర్ కోడ్ సేవ్ చేసుకునే ఆప్షన్ ఉంది. కానీ, ఒక ఆటో అన్నా దీన్ని ఇంత స్మార్ట్‌గా వాడటం చూడటం ఇదే మొదటిసారి. టైమ్ బాగా సేవ్ అవుతుంది అని అన్నారు.
టెక్నాలజీ.. నెక్స్ట్ లెవెల్
ఒకప్పుడు స్మార్ట్‌వాచ్‌లను కేవలం టైమ్ చూడటానికో, ఫిట్‌నెస్ ట్రాకింగ్ కోసమో వాడేవారు. కానీ, మన దేశంలో యూపీఐ (UPI) వచ్చాక డిజిటల్ విప్లవం ఏ రేంజ్‌కు వెళ్ళిందో చెప్పడానికి ఈ ఆటో డ్రైవరే ఒక ఉదాహరణ. క్యూఆర్ కోడ్ స్టిక్కర్ ఎక్కడుందో వెతకకుండా, ఫోన్ అన్‌లాక్ చేసే టైమ్ కూడా వేస్ట్ చేయకుండా.. చేతి గడియారంతోనే పని ముగించేసిన ఈ 'బెంగళూరు ఆటో అన్నా' నిజంగా సూపర్ స్మార్ట్ కదూ...
Took an auto today from Indiranagar to Koramangala and asked the driver for the QR code to pay
— Hemant (@nothemantsharma) June 14, 2026
Bro lifted his wrist, the QR code was on his smartwatch pic.twitter.com/bzDkXe1UBZ
