వైజాగ్కు చెందిన జంట.. వృత్తి రీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఢిల్లీలో ఉంటున్నారు. ఫ్యామిలీ వెకేషన్ కు డెహ్రాడూన్ వెళ్లారు. మంచుకొండల్లో.. రోప్ డైవింగ్ చేస్తూ.. ప్రకృతి అందాలను చూస్తూ ఎంజాయ్ చేశారు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ సోమవారం (జూన్ 15).. భార్య లాడ్జిలో నగ్నంగా రక్తపు మరకలతో పడి ఉంది. జీతానికి జీతం.. అందమైన జీవితం.. ఇంతలోనే ఇలాంటి షాకింగ్ ఇన్సిడెంట్ సంచలనం రేపుతోంది. అసలు ముస్సోరీలో ఏమైంది..?
మృతురాలిని ఢిల్లీలోని కిద్వాయ్ నగర్ కు చెందిన పి. రాధా గాయత్రిగా గుర్తించారు పోలీసులు. గురుగ్రామ్‌లోని ఒక టెక్నాలజీ కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిపారు. శనివారం (జూన్ 13) రాత్రి భర్త సౌమ్య శ్రీచరణ్‌తో కలిసి హోమ్‌స్టేలో ఉన్నారు. రాత్రికి రాత్రే ఆమె చనిపోవడం.. తన భార్యను ఎవరో హత్య చేశారని భర్త ఆరోపించడం పలు అనుమానాలకు కారణమైంది. వీరిది విశాఖపట్నం అని.. 2025 నవంబర్ 8న వివాహం జరిగినట్లు ప్రాథమిక విచారణ ఆధారంగా పోలీసుల చెప్పారు.
- ఏం జరిగింది..?
కపుల్ ఇద్దరూ జూన్ 13న ఢిల్లీ నుంచి బయలుదేరి రిషికేశ్‌కు వెళ్లారు. అక్కడి నుంచి జూన్ 14 రాత్రి ముస్సోరీకి చేరుకున్నారు. రాత్రి సుమారు 11:30 గంటలకు ఒక హోమ్‌స్టేలో చెక్-ఇన్ చేసి, సోమవారం తెల్లవారుజామున 3:30 గంటలకు రూమ్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకున్నారు. అయితే ఉదయం 7:30 గంటల ప్రాంతంలో రూమ్ సర్వీస్ కు వెళ్లిన సిబ్బంది.. రూమ్ ఓపెన్ చేసి చూడగా అక్కడున్న దృశ్యం చూసి షాకింగ్ కు గురైనట్లు పోలీసులకు చెప్పింది. గదిలో ఒక మహిళా అపస్మారక స్థితిలో, ఒంటిపై బట్టలు లేని స్థితిలో ఉందని పోలీసులకు ఫోన్ చేశారు. వైద్య సిబ్బందితో హోటల్ కు వచ్చిన పోలీసులు.. గాయత్రి చనిపోయినట్లు నిర్ధారించారు.
మేము వెళ్లి చూసేసరికి బాధితురాలు నేలపై రక్తపు మడుగులో నగ్నంగా పడి ఉంది. బెడ్ పైన.. బెడ్ షీట్స్ పైన రక్తపు మరకలు ఉన్నాయి. అదే రూమ్ లో రెండు ఖాళీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నాం.. అని ముస్సోరీ స్టేషన్ ఆఫీసర్ (SO) దేవేంద్ర చౌహాన్ చెప్పారు.
భర్తను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. ఆ రాత్రి కాస్త మందు తీసుకుని.. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో నిద్రపోయినట్లు మృతురాలి భర్త శ్రీచరణ్ పోలీసులకు చెప్పాడు. నిద్రలేచి చూసేసరికి తన భార్య అపస్మారక స్థితిలో ఉందని, ఆమె ముక్కు నుంచి రక్తం కారుతోందని తెలిపాడు.
ఫోరెన్సిక్ టీమ్ ఆధారాలు సేకరించింది. భర్త చెప్పిన వివరాలకు కన్వీన్స్ కాని పోలీసులు.. శ్రీచరణ్‌ను ప్రశ్నిస్తున్నారు. కేసును అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని డెహ్రాడూన్‌లోని కరోనేషన్ ఆసుపత్రికి పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపారు.
