హైదరాబాద్ పాతబస్తీలో విద్యార్థుల వీరంగం కలకలం రేపింది. మూడు రోజుల క్రితం చంపాపేట్‌లోని ఐరా జూనియర్ కాలేజీకి చెందిన విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం భౌతిక దాడులకు పాల్పడ్డారు. రోడ్డుపైనే ముఠాలుగా ఏర్పడి ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు.
స్థానికులు డయ్ 100కు ఫోన్ చేయడంతో పెట్రోలింగ్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే పోలీసుల ముందే విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా కొట్లాడుకోవడం అక్కడివారందరినీ విస్మయానికి గురిచేసింది. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలను మరో గ్యాంగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. విద్యార్థుల మధ్య జరిగిన ఈ గ్యాంగ్ వార్‌తో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు.. ఘర్షణకు అసలు కారణాలపై ఆరా తీస్తున్నారు. విద్యార్థులపై తగిన చర్యలు తీసుకునేందుకు కేసు నమోదు దిశగా పోలీసులు చర్యలు వేగవంతం చేశారు.
