కూకట్‌పల్లి ఓలా ఎలక్ట్రిక్ వాహనాల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

కూకట్‌పల్లి ఓలా ఎలక్ట్రిక్ వాహనాల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్: కూకట్‌పల్లి గూడ్స్ షెడ్ రోడ్డులోని ఓలా ఎలక్ట్రిక్ వాహనాల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గోదాంలో సుమారు 50 ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నట్లు అంచనా. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు నాలుగు ఫైర్ ఇంజిన్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. 

ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ, భారీగా పొగలు వస్తుండటంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.