ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అంతర్జాతీయ మీడియాతో పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. 16 నెలల తర్వాత ఈ ఇద్దరూ ఒకరికి ఒకరు ఎదురుపడటంతో ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం గమనార్హం. ఈ భేటీ సమయంలో ఇద్దరు నాయకులు కరచాలనం మాత్రమే చేసుకున్నారు.
#WATCH | Prime Minister Narendra Modi and US President Donald Trump seen interacting at the G7 Summit in Evian, France.
— ANI (@ANI) June 16, 2026
(Video: DD News) pic.twitter.com/HIiZPZOyxR
ఆలింగనం చేసుకోకపోవడం చర్చకు దారితీసింది. ఎందుకంటే.. మోదీ, ట్రంప్ ఎదురుపడిన మెజారిటీ సందర్భాల్లో.. ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకునేవారు. ఇద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం కనిపించేది. కానీ.. పాకిస్తాన్, ఇండియా మధ్య ఘర్షణ వాతావరణం, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
From G7 summit : pic.twitter.com/m8A85Ki37X
— Sidhant Sibal (@sidhant) June 16, 2026
ఇండియా, పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడిన సమయంలో ట్రంప్ తనను తాను శాంతిదూతగా ప్రకటించుకోవడం, తన కృషి వల్లే ఇండియా, పాకిస్తాన్ వెనక్కి తగ్గాయని బాహాటంగా చెప్పుకోవడం.. ఇండియాపై అనాలోచిత వ్యాఖ్యలు, టారిఫ్లు విధించడం.. ఇలా పలు కారణాల వల్ల ఇండియా, అమెరికా మధ్య సత్సంబంధాలు మసకబారాయి. ఈ క్రమంలో.. ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ ఒకరికి ఒకరు ఎదురుపడటంతో ఈ పరిణామం అంతర్జాతీయ మీడియా దృష్టిని కూడా అమితంగా ఆకర్షించింది.
►ALSO READ | TMC ఓటమికి ఈ నాలుగే ప్రధాన కారణాలు.. దీదీ ఓటమిపై అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు
