ఆరేళ్ల తర్వాత భారత్‌‌ కు జిన్ పింగ్.. సెప్టెంబర్‌‌లో బ్రిక్స్ సదస్సుకు హాజరు!

ఆరేళ్ల తర్వాత భారత్‌‌ కు జిన్ పింగ్.. సెప్టెంబర్‌‌లో బ్రిక్స్ సదస్సుకు హాజరు!

న్యూఢిల్లీ: భారత్, చైనా దేశాల మధ్య సంబంధాలు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్న తరుణంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌‌పింగ్ భారత్‌‌లో పర్యటించనున్నారు. సెప్టెంబర్‌‌ 12-13 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఆయన రానున్నారు. 2020 గల్వాన్‌‌ లోయ ఘర్షణల అనంతరం ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. దాదాపు ఆరేండ్ల తర్వాత జిన్‌‌పింగ్ భారత్‌‌కు రానున్నారు. చివరిసారిగా 2019 అక్టోబర్‌‌లో ఆయన భారత్‌‌లో పర్యటించా రు. ఈ పర్యటనకు ముందు ఇరు దేశాల మధ్య దౌత్య సంప్రదింపులు ముమ్మరమ య్యాయి. ఇందులో భాగంగా ఎన్‌‌ఎస్‌‌ఏ అజిత్‌‌ దోవల్ చైనాలో పర్యటించనున్నారు. సరిహద్దు వివాదంపై ప్రత్యేక ప్రతినిధుల చర్చలు జరగనున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.