తాతయ్య ఆరోగ్యం కోసం చైనా కుర్రాడి అద్భుత ఆలోచన.. ఏఐ టెక్నాలజీతో ప్రాణాలు కాపాడుతున్న మనవడు..

తాతయ్య ఆరోగ్యం కోసం చైనా కుర్రాడి అద్భుత ఆలోచన.. ఏఐ టెక్నాలజీతో ప్రాణాలు కాపాడుతున్న మనవడు..

తాతయ్య మందులు వేసుకోవడం మర్చిపోకుండా ఉండేందుకు ఓ చైనా కుర్రాడు అద్భుతమైన పనిచేసాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో ఒక సింపుల్ యాప్‌ను తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

షాంఘైకి చెందిన 18 ఏళ్ల మా కై(Ma Kai) అనే విద్యార్థి ఈ మధ్యనే  స్కూల్ చదువు పూర్తి చేసి, చైనా ఎంట్రన్స్ ఎగ్జామ్  ‘గావోకావో’  రాశాడు. త్వరలో అతను కాలేజీ కోసం వేరే సిటీకి వెళ్లాల్సి ఉంది. ఒంటరిగా ఉంటున్న తన 70 ఏళ్ల తాతయ్య తనని  చిన్నప్పటి నుంచి ఆయనే పెంచడంతో ఇద్దరి మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. తాతయ్యకు జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, తరచూ మందులు వేసుకోవడం మర్చిపోవడం లాంటి సమస్యలు ఉన్నాయి. అంతేకాదు, పొరపాటున గడువు తీరిన అంటే ఎక్స్‌పైరి అయిన మందులు వేసుకుంటారేమోనని మా కై చాలా భయపడేవాడు.

ఈ సమస్యకు చెక్ పెట్టాలని ఆలోచించిన ఆ కుర్రాడు.. చైనాకు చెందిన ‘మోడల్‌బెస్ట్’ అనే కంపెనీకి చెందిన ఏఐ టెక్నాలజీ (MiniCPM) సహాయంతో ఒక యాప్‌ను రూపొందించాడు. ఈ యాప్ స్పెషాలిటీ  ఏంటంటే..

►ALSO READ | రష్యా జైళ్లలో ఉక్రెయిన్‌‌‌‌ ఖైదీలపై అత్యాచారాలు

మెడిసిన్ అలర్ట్: తాతయ్య సమయానికి మందులు వేసుకునేలా ఇది కరెక్ట్ టైమ్‌కి గుర్తు చేస్తుంది.

ఎక్స్‌పైర్ డేట్ చెకింగ్: మందుల ప్యాకెట్ ఫోటోను ఈ యాప్‌లో అప్‌లోడ్ చేస్తే చాలు.. ఆ మందుల గడువు ఆపోయిందో లేదో ఇట్టే చెప్పేస్తుంది. ఒకవేళ గడువు అయిపోతే, ఈ మందులు వాడొద్దు అంటూ గట్టిగా హెచ్చరిస్తుంది.

ఈ మధ్య షాంఘైలో జరిగిన వరల్డ్ ఏఐ కాన్ఫరెన్స్‌లో ఈ టెక్నాలజీ నిపుణులను కలిసేందుకు వెళ్లిన మా కై, వారి సహాయంతో ఈ చిన్న యాప్‌ను డెవలప్ చేశాడు. ప్రస్తుతం ఇది  టెస్టింగ్ లోనే ఉన్నప్పటికీ.. తన తాతయ్య ఆరోగ్యంపై ఉన్న ప్రేమతో ఆ కుర్రాడు చేసిన ఈ పనికి ప్రశంసలు దక్కుతున్నాయి.