హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ను తనకు తానే.. సీఎం రేవంత్ రెడ్డి ఆపుకుంటున్నాడని.. ఇందులో ఎవరి ప్రమేయం.. పాత్ర లేదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నేను ఆపమంటే ఆగటం అంటూ ఏమీ ఉండదని.. ఓ తెలంగాణ వ్యక్తిగా.. మంత్రిగా.. తెలంగాణకు ఇంకా చాలా చేయాలి.. ఎక్కువగా నిధులు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం చేశారాయన.
నేను ఆపమంటే మెట్రో ఆగటం లేదని.. సీఎం రేవంత్ రెడ్డినే తనకు తానుగా ఆ ప్రాజెక్ట్ ను అడ్డుకుంటున్నాడని.. నేను ఆపమంటే ఏ ప్రాజెక్ట్ ఆగదని వివరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2ను తానే అడ్డుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మంగళవారం (జూన్ 16) ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. 7 ఏళ్లుగా కేంద్రమంత్రిగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న అన్ని రకాలుగా తెలంగాణ ప్రయోజనాలకోసమే పని చేశానని స్పష్టం చేశారు.
►ALSO READ | మహా పాలిటిక్స్‌లో ఆపరేషన్ టైగర్ ప్రకంపనలు.. ఎమ్మెల్యేలకు ఉద్ధవ్ అత్యవసర పిలుపు
ఏ ప్రాజెక్టు అయినా మరింత బాగా జరగాలని కోరుకున్నా తప్పా.. ఒక్క ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్నారు. హైదరాబాద్ మెట్రో ఫేస్2 50-50 శాతం భరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేస్ 1కి రూ.1250 కోట్లు కేంద్రం ఇవ్వడమే కాకుండా స్వయంగా పీఎం ప్రారంభించారని గుర్తు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి దుందుడుకుగా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. మాకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. రేవంత్ రెడ్డికి నేను జవాబుదారి కాదని.. తెలంగాణ ప్రజలకు జవాబుదారి అని పేర్కొన్నారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను తు.చా తప్పకుండ అమలు చేస్తున్నామన్నారు.
కేంద్రం నుంచి రావాల్సినవన్ని సాధించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ బిల్లు పాస్ కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసిన నేను.. తెలంగాణ అభివృద్ధి ని ఎందుకు అడ్డుకుంటానని ప్రశ్నించారు. ఎవరిదగ్గరో పాఠాలు నేర్చుకోవాల్సిన స్థితిలో నేను లేనన్నారు. ఎంఎంటీఎస్ రెండో ఫేస్‌కి అప్పటి సీఎం కేసీఆర్ సహకరించలేదు అయినా ప్రారభించామని తెలిపారు.
