Vaibhav Suryavanshi: క్రికెట్ ఫీల్డ్‌లో భారత్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ అంటేనే ఎప్పుడూ ఒక రేంజ్ హీట్ ఉంటుంది. తాజాగా దంబూల్లా వేదికగా జరిగిన త్రైపాక్షిక సిరీస్ (Tri-Nation Series)లో ఇండియన్ యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) కి, శ్రీలంక-ఏ ప్లేయర్లకు మధ్య జరిగిన గొడవ ఇప్పుడు సోషల్ మీడియాలో తెట ట్రెండ్ అవుతోంది. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా లంక డ్రెస్సింగ్ రూమ్‌లో దీనిపై పెద్ద పంచాయితీ నడిచింది.
గో హోమ్.. ఇది ఐపీఎల్ కాదు బ్రో:
క్రిక్ బజ్ (Cricbuzz) రిపోర్ట్ ప్రకారం.. శ్రీలంక-ఏ ప్లేయర్ విషెన్ హలంబా (Vishen Halambage) గత జూన్ 9న జరిగిన మ్యాచ్ నుంచే వైభవ్ సూర్యవంశీని టార్గెట్ చేస్తూ కంటిన్యూస్‌గా స్లెడ్జింగ్ చేస్తున్నాడట. ఆ మ్యాచ్‌లో ఇండియా క్లోజ్ ఫినిష్‌తో గెలిచింది. కానీ, సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, ఆ తర్వాత మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్ (Super Over) కి వెళ్ళినప్పుడు ఈ లొల్లి పీక్స్‌కి చేరింది.
వైభవ్ ని రెచ్చగొట్టిన లంక ప్లేయర్:
వైభవ్ సూర్యవంశీ సూపర్ ఓవర్‌లో ఓపెనింగ్‌కు వస్తుండగా.. లంక ప్లేయర్ విషెన్ హలంబాగే రెచ్చగొడుతూ, గో హోమ్, ఇది ఐపీఎల్ కాదు (Go home, this is not the IPL) అంటూ గట్టిగా అరిచాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే సిట్యుయేషన్ మరింత వైల్డ్ గా మారింది. హలంబా అంతటితో ఆగకుండా వైభవ్ వైపు, అలాగే మరో ఇండియన్ ఓపెనర్ సూర్యాంశ్ శెడ్జ్ (Suryansh Shedge) వైపు అగ్రెసివ్‌గా దూసుకొచ్చాడు.
గట్టిగా ఇచ్చిన వైభవ్:
శ్రీలంక ప్లేయర్ అంతలా రెచ్చిపోవడంతో వైభవ్ సూర్యవంశీ కూడా గట్టిగానే తిప్పికొట్టాడు. ఇద్దరి మధ్య గొడవ పెద్దదవుతున్న టైమ్‌లో.. లంక సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా (Niroshan Dickwella) మధ్యలో దూరి ఇద్దరినీ విడదీసి కూల్ చేశాడు. డిక్వెల్లా గనుక రాకపోయి ఉంటే గ్రౌండ్‌లోనే ఇద్దరూ కొట్టేసుకునేలా కనిపించింది.
లంక డ్రెస్సింగ్ రూమ్‌లో పంచాయితీ:
ఈ ఇన్సిడెంట్ శ్రీలంక క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మ్యాచ్ అయిపోయాక ఇండియన్ టీమ్‌కు అధికారికంగా క్షమాపణలు (Apology) చెప్పాలా వద్దా అనే దానిపై లంక మేనేజ్‌మెంట్‌లో పెద్ద డిస్కషన్ నడిచింది. లంక బోర్డులోని కొందరు సభ్యులు హలంబా ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ నెలకొంది. ప్రస్తుతం ఆడుతున్న శ్రీలంక-ఏ స్క్వాడ్‌లో లేని కొందరు ఇతర లంక ప్లేయర్స్ వైభవ్ కి పర్సనల్‌గా ఫోన్ చేసి మాట్లాడారు. ఐపీఎల్ (IPL) ద్వారా వైభవ్‌తో ఉన్న పరిచయంతో.. గ్రౌండ్‌లో జరిగిన దానికి తాము ఎంతగానో విచారిస్తున్నామంటూ లంక ప్లేయర్స్ సారీ చెప్పారు.
ఇండియాకు నెక్స్ట్ మ్యాచ్ డూ ఆర్ డై:
ఈ మ్యాచ్‌లో ఇండియా చివరకు 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సిరీస్‌లో ముందడుగు వేయాలంటే.. తదుపరి ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే మ్యాచ్ భారత జట్టుకి డూ ఆర్ డై మ్యాచ్‌గా మారింది. మరి మన కుర్రాళ్ళు ఆఫ్ఘన్‌పై గెలిచి లంకకు గట్టి కౌంటర్ ఇస్తారేమో లేదో చూడాలి మరీ.
