2027 ODI World Cup: 2027లో దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు ఇప్పటి నుంచే భారత్ పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని టీమిండియా మాజీ క్రికెటర్ స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా లేకపోతే ఇండియన్ బౌలింగ్ దళం బలహీనంగా కనిపిస్తోందని, స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీపై బీసీసీఐ సెలెక్టర్లు అతడితో మాట్లాడాలని కోరాడు.
భువీ రీఎంట్రీ తప్పనిసరి.. బీసీసీఐకి అశ్విన్ విజ్ఞప్తి:
భువనేశ్వర్ కుమార్ ప్రస్తుత పరిస్థితిపై ఆర్. అశ్విన్ మాట్లాడుతూ.. నేను గనుక సెలెక్టర్ అయితే వెంటనే భువీతో మాట్లాడతాను.. విజయ్ హజారే ట్రోఫీతో పాటు దేశవాళీ ఫస్ట్ క్లాస్ టోర్నీలన్నీ ఆడించి, పూర్తి ఫిట్‌నెస్‌తో అతడిని సిద్ధం చేస్తాను.. దక్షిణాఫ్రికా పిచ్‌లపై స్వింగ్ అయ్యే భువీ సేవలు టీమిండియాకు ఖచ్చితంగా అవసరం అని తెలిపాడు.
అశ్విన్ పక్కా జట్టు ప్రణాళిక:
2027 మెగా టోర్నీకి ఎంపికయ్యే అవకాశం ఉన్న ఆటగాళ్లను అశ్విన్ 3 కేటగిరీలుగా వర్గీకరించాడు. అందులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, భువనేశ్వర్ కుమార్‌లకు ఖాయంగా చోటు దక్కే ప్లేయర్లు విభాగంలో స్థానం కల్పించాడు.
రిషభ్ పంత్, సంజూ శాంసన్‌లకు నో ఛాన్స్
మరోవైపు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణలను అవకాశం రావొచ్చు అనే కేటగిరీలో పెట్టాడు. అయితే రిషభ్ పంత్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, రవి బిష్ణోయ్, శివమ్ దూబే లాంటి ప్లేయర్లకు జట్టులో స్థానం లేదని (No) అశ్విన్ స్పష్టం చేయడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ALSO READ : పాక్ కెప్టెన్‌ను కౌగిలించుకున్న జెమీమా.. అభిమానుల మధ్య చర్చ, నెట్టింట ట్రోలింగ్!
అశ్విన్ డ్రీమ్ టీమ్:
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, భువనేశ్వర్ కుమార్
Wait till the end for an interesting suggestion by R Ashwin 👀 pic.twitter.com/zd8z2ePGYe
— Cricinfo (@cricinfo) July 30, 2026
