Jemimah Rodrigues: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్‌లో భారత స్టార్ మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ వివాదంలో చిక్కుకుంది. బర్మింగ్‌హామ్ ఫినిక్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ ఫాతిమా సానాను జెమీమా ఆత్మీయంగా కౌగిలించుకోవడమే ఈ వివాదానికి అసలు కారణమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు.
నో హ్యాండ్‌షేక్ పాలసీ వేళ హగ్ ఫోటో వైరల్:
భారత్– పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలతో ఇండియన్ క్రికెట్ జట్లు పాక్ ఆటగాళ్లతో కరచాలనం (హ్యాండ్‌షేక్) చేయకూడదనే నిర్ణయాన్ని పాటిస్తూ వస్తున్నాయి. ఆసియా కప్ 2025, టీ20 వరల్డ్ కప్ 2026 పోటీలలో కూడా టీమిండియా మెన్స్, ఉమెన్స్, U19 టీమ్స్ పాక్ ప్లేయర్లతో షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా దూరంగా ఉన్నాయి. కానీ విదేశీ లీగ్‌లో జరిగిన ఈ ఘటనపై కొంతమంది ఆటగాళ్ల మధ్య క్రీడాస్ఫూర్తి సహజం అని మద్దతు తెలుపుతుంటే, మరికొందరు మాత్రం జాతీయ విధానాన్ని పక్కన పెట్టడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మ్యాచ్‌లో జెమీమా మెరుపులు.. సౌత్రన్ బ్రేవ్ ఘన విజయం:
ఈ వివాదం పక్కన పెడితే, మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది. సౌత్రన్ బ్రేవ్ జట్టు తరఫున ఆడుతున్న జెమీమా 18 బంతుల్లో 28 రన్స్ చేసి జట్టు 140/3 స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఇక 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బర్మింగ్‌హామ్ ఫినిక్స్ 116/5 పరుగులకే పరిమితమైంది. దీంతో సౌత్రన్ బ్రేవ్ 24 రన్స్ తేడాతో గెలిచింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి సౌత్రన్ బ్రేవ్ లీగ్‌లో డ్రీమ్ రన్‌ను కొనసాగిస్తోంది.
ఎఫెక్ట్ చూపించలేకపోయిన ఫాతిమా సానా:
బర్మింగ్‌హామ్ ఫినిక్స్ తరఫున బరిలోకి దిగిన పాక్ కెప్టెన్ ఫాతిమా సానా ఈ మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచింది. బౌలింగ్‌లో 15 బంతుల్లో 33 రన్స్ ఇచ్చి భారీగా పరుగులు సమర్పించుకోగా, బ్యాటింగ్‌లో కేవలం 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఫినిక్స్ బ్యాటర్ డెవినా పెరిన్ (52) హాఫ్ సెంచరీ చేసినప్పటికీ జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చలేకపోయింది.
Everyone debating if Fatima Sana and jemimah Rodrigues would shake hands and they straight up HUGGED?!😭😭🙏
— Usman (@Usman_Offical56) July 31, 2026
Keep politics out of sports FOREVER.
We manifest Smriti and universe gave us Jemimah!
Over the moon already. pic.twitter.com/1VV4ZqeElO
