విజయవాడ: ఏపీలో యువకుడు గాదె సాయి కృష్ణ మిస్సింగ్ కేసు కలకలం రేపుతోంది. జూన్ 29వ తేదీలోపు హాజరుపరచాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
The brutal daylight murder of Sai Krishna is a disgrace to our society and a reminder of how far we’ve drifted from basic humanity. Though he belonged to @JanaSenaParty, we strongly condemn this heinous crime. Humanity first, politics second. Om Shanthi 🕉️ pic.twitter.com/ouo7Tuxjm5
— Bittu🗽 (@iamrealbittu) June 16, 2026
గాదె సాయి కృష్ణను పోలీసులు కొట్టి చంపారని.. సాయికృష్ణ డెడ్ బాడీని కృష్ణలంక శ్మశాన వాటికలో కాల్చేశారని.. ఆధారాలు లేకుండా చేశారని.. బూడిద కూడా ఆ కుటుంబానికి ఇవ్వకుండా చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా కృష్ణలంక పోలీసులు వ్యవహరించిన తీరు.. చేసిన ఘోరం అంటూ ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తనకు వ్యక్తిగతంగా ఉన్న సమాచారం ఆధారంగా ఇది చెబుతున్నానని అంబటి రాంబాబు వివరించారు.
నెల రోజులుగా సాయికృష్ణ ఆచూకీ కోసం అతని తల్లి విజయలక్ష్మి వెతుకుతూనే ఉందని.. ఎన్నోసార్లు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు అంబటి రాంబాబు. ‘నీ కొడుకు లేడనుకో.. నీ కొడుకు చనిపోయాడు అనుకో’ అంటూ సీఐ నాగరాజు ఆమెతో చెప్పినట్లు మీడియా సమావేశంలో అంబటి రాంబాబు వెల్లడించారు.
నెల రోజుల క్రితం కృష్ణలంక పోలీసులు సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారని.. అప్పటి నుంచి అతను కనిపించకుండాపోయాడని.. ఇది పోలీసుల లాకప్ డెత్ అని.. అతన్ని శశ్మానంలోనే దహనం చేశారంటూ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం.. ఏపీ పోలీసులు, హోం మంత్రి ఎలాంటి ప్రకటన చేయలేదు.
జూన్ 29వ తేదీన హైకోర్టులో విచారణ ఉండటంతో.. అప్పటికి పోలీసులు ఏం చెబుతారనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. అంబటి రాంబాబు చెబుతున్నది అబద్దం అయితే సాయి కృష్ణను హైకోర్టులో హాజరుపెడతారు. అంబటి రాంబాబు చెబుతున్నది నిజం అయితే హాజరుపరచరు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇంతకీ సాయి కృష్ణ ఎక్కడ ఉన్నాడు అనేది ఇప్పుడు అందరిలో తలెత్తుతున్న ప్రశ్న.
