మోడీని తిడుతుంటే కన్నీళ్లు వచ్చినయ్.. ఆయనను ఢీకొట్టే నాయకుడు లేడు.. రాబోడు: పవన్ కల్యాణ్

మోడీని తిడుతుంటే కన్నీళ్లు వచ్చినయ్.. ఆయనను ఢీకొట్టే నాయకుడు లేడు.. రాబోడు: పవన్ కల్యాణ్

అమరావతి: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‎పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్‎లో చేపట్టిన ఆందోళనల్లో యువత ప్రధాని మోడీని తిడుతుంటే తనకు కన్నీళ్లు వచ్చాయని భావోద్వేగానికి గురయ్యారు. అసలు మోడీ కష్టం కొత్తతరానికి ఏం తెలుసని అన్నారు. ఎవరేం చేసిన మోడీని ఢీకొట్టే నాయకుడు లేడు.. రాబోడని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. 

హనుమంతుడి కష్టానికి ఏ ప్రతిఫలం ఇస్తాం.. స్తుతినే ఇవ్వాలి. అలాగే, మోడీ కష్టాన్ని గుర్తించడమే మన కర్తవ్యమని పేర్కొన్నారు. మోడీ ఆయన వద్దనుకున్నంత వరకు ఆయన దేశ ప్రధానిగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. పాతికేళ్లలోపు వయసు పిల్లలున్న తల్లిదండ్రులకు చెబుతున్నా.. మీ పిల్లలను సరైన దారిలో పెట్టండంటూ పరోక్షంగా నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిరసన తెలిపిన యువతను పవన్ కల్యాణ్ తప్పుబట్టారు.  

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఓ వర్గం సమర్థిస్తుంటే.. మరో వర్గం మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమకు జరిగిన అన్యాయంపై అణిచివేతలు, దాడులను ధైర్యంగా ఎదుర్కొని యువత తమ గళం విప్పడాన్ని తప్పుబట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మోడీపై ప్రేమ ఉంటే ఆయనను ఎంతైనా పొగడుకోండని.. అంతేకానీ అన్యాయం, అక్రమాలకు వ్యతిరేకంగా శాంతియుత నిరసన తెలిపిన యువతను తప్పుబట్టడం సరికాదని పవన్ కల్యాణ్‎పై నెటిజన్లు చురకలంటిస్తున్నారు.