ఏపీలోని విజయనగరం జిల్లా భోగాపురం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు ఇనెటర్నేషనల్ ఎయిర్ పోర్టును ప్రారంభించారు ప్రధాని మోడీ. శనివారం ( ఆగస్టు 1 ) జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ. ఉత్తరాంధ్రను కోస్టల్ ఎకనామిక్ కారిడార్ గా అభివృద్ధి చేస్తామని అన్నారు. మూలపేట, రామాయపట్నం పోర్టులు నిర్మిస్తామని అన్నారు.
చంద్రబాబు నేతృత్వంలో ఏపీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారుతుందని..గ్రోత్ సెంటర్ ఒక్క ఫ్యాక్టరీతో నిర్మించబడదని అన్నారు మోడీ. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని అన్నారు.బ్లూ ఎకనామిని బలోపేతం చేస్తున్నామని...ఏపీలో గూగుల్ AI,క్లౌడ్ సంస్థలు పెడుతోందని...నక్కపల్లిలో భరో ఫార్మా ప్రాజెక్టులకు కేంద్రం సహకరిస్తోందని అన్నారు మోడీ.
గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని.. ఏపీని ఫార్మా హబ్ గా మార్చుతామని అన్నారు మోడీ.థింసా డ్యాన్స్ రికార్డ్ సాధించడం గొప్పగా ఉందని...స్వర్ణాంధ్ర విజన్ కు ఈరోజు కీలకమైన రోజు అని అన్నారు మోడీ. థింసా డ్యాన్స్ లో దేశ సంస్కృతి కనపడిందని అన్నారు మోడీ.
