హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉండే రూట్లలో గచ్చిబౌలి-డీఎల్ఎఫ్ రూట్ ఒకటి. ఈ ఏరియాల్లో ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉండటంతో నిత్యం ట్రాఫిక్ ఉంటుంది. ఈ రూట్లో ట్రాఫిక్ తగ్గించేందుకు ఫ్లైఓవర్ నిర్మాణం, రోడ్డు విస్తరణ చేపట్టింది ప్రభుత్వం. ఈ క్రమంలో మూడు నెలల పాటు గచ్చిబౌలి-డీఎల్ఎఫ్ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు పోలీసులు.
ఈ క్రమంలో ఫ్లైఓవర్, రోడ్డు పనులు వేగవంతం చేయాలని.. ట్రాఫిక్ నిర్వహణ సజావుగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్.
3 నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు:
ఫ్లైఓవర్, రోడ్డు విస్తరణ పనుల కారణంగా మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించాలని నిర్ణయించారు. నిర్మాణ పనులను సులభతరం చేయడానికి, ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి అవసరమైన ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని తెలిపారు పోలీసులు.
►ALSO READ | 140 వాహనాలు, డిజాస్టర్ ఎక్విప్‌మెంట్ కొనుగోలుకు హైడ్రాకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్
ఈ క్రమంలో వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని, సాధ్యమైన చోట ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు.
నిర్మాణ పనుల వల్ల కలిగే అంతరాయాలను వీలైనంత తగ్గించేందుకు సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ చేపట్టామని.. ప్రణాళిక రూపొందించామని తెలిపారు పోలీసులు.
ఫ్లైఓవర్ నిర్మాణంతో ట్రాఫిక్ నుండి రిలీఫ్:
రద్దీగా ఉండే గచ్చిబౌలి–డీఎల్‌ఎఫ్ మార్గంలో ఫ్లైఓవర్, రోడ్డు అభివృద్ధి పనుల వల్ల ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని కమిషనర్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, హైదరాబాద్ ఐటీ కారిడార్ గుండా రోజూ ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు వేగవంతమైన, సులభమైన కనెక్టివిటీ లభిస్తుందని అన్నారు.
