హైదరాబాద్: 140 వాహనాలు, డిజాస్టర్ ఎక్విప్‌మెంట్ కొనుగోలుకు హైడ్రాకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైడ్రా పరిధి విస్తరణ, అత్యవసర సేవల అవసరాల దృష్ట్యా కొనుగోళ్లకు అనుమతి ఇచ్చింది. తొలి దశలో 50 శాతం వాహనాలు, పరికరాల కొనుగోళ్లు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన 140 వాహనాలు, పరికరాల కొనుగోలుకు రెండో దశలో అనుమతి ఇచ్చింది. డీఆర్ఎఫ్ టీమ్స్ సంఖ్య పెరగడంతో అదనపు వనరుల అవసరం ఏర్పడింది.
21 డీఆర్‌ఎఫ్ ట్రక్కులు, 2 ఇన్నోవా హైక్రాస్ వాహనాలు,1 ఇన్నోవా క్రిస్టా, 54 స్కార్పియో, 2 ట్రూప్ క్యారియర్ వ్యాన్లు, 2 బస్సులు, 37 బైక్‌ల కొనుగోలు చేయనున్నారు. 21 డీఆర్‌ఎఫ్ ఎక్విప్‌మెంట్ యూనిట్ల కొనుగోలుకు ఆమోదం లభించింది. ఈ నిధులను 2026-27 బడ్జెట్ నుంచి ప్రభుత్వం కేటాయించనుంది. ఆర్థిక శాఖ సమ్మతితో సోమవారం (జూన్ 15) ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అవసరమైన తదుపరి చర్యలు చేపట్టాలని హైడ్రా కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
►ALSO READ | మోడీ రాజీనామా చేస్తే.. నేను ప్రభుత్వాన్ని రద్దు చేస్తా: బీజేపీ ఛాలెంజ్‌పై CM రేవంత్ రియాక్షన్
