ఇవాళ్టి ( ఆగష్టు 2 ) నుంచి లష్కర్ బోనాలు... రెండు రోజులు వైన్సులు బంద్

ఇవాళ్టి ( ఆగష్టు 2 ) నుంచి లష్కర్ బోనాలు... రెండు రోజులు వైన్సులు బంద్

పద్మారావునగర్: సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మల్కాజిగిరి జోన్ పరిధిలోని మార్కెట్, గోపాలపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్​ అండ్​ రెస్టారెంట్లు తాత్కాలికంగా మూసివేయనున్నారు. 

అయితే స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలోని బార్లకు ఈ బంద్​ వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. ఆగస్టు 2 ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 4 ఉదయం 6 గంటల వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా విద్యుత్ సరఫరా ఏర్పాట్లను టీజీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మెట్రో జోన్ చీఫ్ ఇంజినీర్ కరుణాకర్ బాబు, సికింద్రాబాద్ ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ గోపయ్య, డివిజనల్ ఇంజినీర్లు బ్రహ్మానందం, చక్రవర్తి, రమణారావుతో కలిసి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. 33/11 కేవీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్ నుంచి మూడు వేర్వేరు సోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ద్వారా 11 కేవీ మూడు ఫీడర్లను సిద్ధం చేశారు. 

అలాగే మూడు పవర్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్లతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే విద్యుత్ పునరుద్ధరణ కోసం మూడు మొబైల్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్లను అందుబాటులో ఉంచారు. సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశారు. లోపాలు తలెత్తితే స్పందించేందుకు సుమారు 20 మంది సిబ్బందితో ప్రత్యేక బృందాలను నియమించారు. బోనాల ఉత్సవాలు ముగిసే వరకు ఈ బృందాలు మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు విధుల్లో ఉండనున్నట్లు సీఎండీ తెలిపారు.