అన్ని దేశాల్లో Gen Zలు.. కానీ మన దేశంలో బొద్దింకలు ఎట్లైరి ?

అన్ని దేశాల్లో Gen Zలు.. కానీ మన దేశంలో బొద్దింకలు ఎట్లైరి ?

భారతదేశంలో కనీవినీ ఎరగని విధంగా జెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీ బొద్దింకలు అనే శక్తుల మీద ఎనలేని చర్చ జరుగుతున్నది. ఈ జెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీ బొద్దింకలు 36 రోజులు ఢిల్లీలో ధర్నాలు,  ప్రొటెస్టుల గడ్డ అయిన జంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హంగామా చేశారు.

చివరికి  దేశ విద్యాశాఖ మంత్రితో  రాజీనామా చేయించారు. పరీక్షల రద్దుతో షాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గురై చనిపోయిన విద్యార్థులకు కోటి రూపాయల నష్టపరిహారం ఇచ్చేందుకు ఎన్నడూ లేనివిధంగా  కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించుకున్నారు.

విద్యార్థుల మీద పెట్టిన  కేసులన్నీ ఎత్తివేసే  ఒప్పందం చేయించుకున్నారు. వాళ్ల పోరాటం చేస్తున్నన్ని రోజులు వాళ్లమీదనే దృష్టిపెట్టి  సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లు, టీవీలు చూస్తున్నవారికి ఇదంతా కలా, నిజమా అనిపించేటట్టు చేసి జంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి జులై 25న వెళ్లిపోయారు.

జెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీ అనే వాడుక 20 శతాబ్దం అంతమై 21వ శతాబ్ద  ప్రారంభ దశలలో పుట్టిన యువతకు అమెరికా, యూరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మేధావులు, మీడియా పెట్టిన పేరు. ప్రత్యేకంగా 1997‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2012 మధ్య  పుట్టిన పిల్లలు ఒక కొత్త మానవ యుగ పిల్లలుగా ఈ పేరు వారికి వచ్చింది. వీరంతా పుట్టుక తోటే సెల్​ఫోన్లు, ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతిలో పట్టుకుని పుట్టిన కొత్తతరం అని అర్థం.

వీరి ఆలోచన, అలవాట్లు, జీవన విధానం ఒక దేశ పరిధికో, ఒక మత పరిధికో, మనలాంటి దేశంలో ఒక కుల పరిధికో లేదా ఆడ, మగ అనే తేడాకో కట్టుబడి ఉండవు. వీళ్లు పాతతరానికి మరో యుగపు మనుషుల్లా కనిపిస్తారని అర్థం. వీళ్లు తాము పుట్టిన ఇంట్లోని తల్లిదండ్రుల కంటే, స్కూల్లో, కాలేజీల్లో అధ్యాపకుల కంటే భిన్నంగా ఆలోచిస్తారు.

ప్రపంచ జ్ఞానాన్ని తమ సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా సేకరించగలరు, వాడగలరు. పాతకాలపు మత, కులతత్వాలు వీరిని నిత్యజీవితంలో బంధించి ఉంచలేదు. వీళ్లంతా  ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉన్నారు. కానీ  ఒక కొత్త నినాదంతో ఈ దేశంలో ఢిల్లీ లాంటి అధికార కేంద్రంలో వారినందరినీ ఒక దగ్గర చేర్చడం ఒక కొత్త సంఘటన.   దేశ రాజకీయ, సాంఘిక, ఆర్థిక, విద్యా వ్యవస్థను మార్చేందుకు  ఏం చేయగలుగుతారో మనం వేచి చూడాలి. మరి ఈ దేశంలో వీళ్లు బొద్దింకలు ఎలా అయ్యారు? అన్ని దేశాల్లో  జెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీలు అయితే, ఈ దేశ ప్రత్యేకతకు బొద్దింకలు ఒక కొత్త ఉదాహరణ !

బొద్దింకలు చీదరణకు గురయ్యే పురుగులు
మరి కొత్త తరం సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వీరులు తమకంటూ కాక్రోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనతా పార్టీ అనే ఒక కొత్త పార్టీని ఎందుకు పెట్టుకున్నారు ? కాక్రోచ్ అంటే మనందరం ఇంట్లో ద్వేషించుకుని, పురుగులు మందులు కొట్టి చంపే నీచ క్రిమికి ఇంత గౌరవం ఎందుకిచ్చారు ? ఈ 21వ శతాబ్దపు యువ మేధావి వర్గం ? జెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీ అంటే మరో అర్థం జెనరేషన్ జూమర్లు. అంటే దేన్నైనా ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దొరకబట్టి  జూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి చూపగలరు. వీళ్లు బొద్దింకను జూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి, ముఖాలకు తగిలించుకుని, రోడ్లమీదికొచ్చి అదంటేనే ద్వేషించుకునే  కోట్లాది మందిని ఆ క్రిమిని ప్రేమించేలా ఎలా చేశారు ? బొద్దింకల పట్ల మనకిప్పుడు ఎంత ప్రేమో !

అభిజిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీప్కే క్రియేటివిటీ, ధైర్యం
ఒక  కొత్త ఆలోచన చేయడానికి క్రియేటివిటీ, ధైర్యం ఉండాలి. భారతదేశ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిరుద్యోగులను  కాక్రోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అని ఏ స్థితిలో, ఏ ఉద్దేశంతో అన్నా అభిజిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రియేటివిటీ, ధైర్యం మాత్రమే దాన్ని మలుపు తిప్పాయి. ఎవరు ఊహించగలిగారు అమెరికాలో ఒక దళిత యువకుడు ఆ చదువు భారం మోయడానికి భయపడే స్థితిలో ఉండి కాక్రోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనతా పార్టీ  అనే పేరుతో ఒక ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యమం మొదలుపెడతాడని. అతని తండ్రి ఒక మామూలు సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీరు. అప్పు తీసుకుని అతడిని అమెరికా తోలాడు.

అతను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాటకు ఇంత చలించి నేనూ, నిరుద్యోగులంతా కాక్రోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లమే అని దాన్ని సొంతం చేసుకుని ద్వేషించుకునే క్రిమిని ప్రేమించే మార్పు చేయగలగడం మాటలా ? అయితే అతని ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీకి ఇంత ఆదరణ వస్తుందని, అతను దానికో ప్రజాస్వామిక మేనిఫెస్టో ఏర్పాటు చేస్తాడని, అతడిని ఇన్ని లక్షల మంది యువకులు, బీజేపీ, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ఎస్ కుటుంబాల్లో కూడా పుట్టి పెరిగినవారు కూడా సపోర్టు చేస్తారని ఎవరూ ఊహించలేదు.

చివరికి 36 రోజులు వేలాదిమంది దేశం నలుమూలల నుంచి జంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరి దేశ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయిస్తారని ఎవరూ నమ్మలేదు. అది ఇప్పుడు దేశ రాజకీయ చరిత్రను మలుపుతిప్పే స్థితిగా ఉన్నట్టు కనిపిస్తున్నది. ఇది దేశ వాతావరణంలో  ఎలా సాధ్యమైందనేది కూడా చూడాలి.

దేశ విద్యా వ్యవస్థ
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా మన దేశ విద్యావ్యవస్థ గందరగోళంలో ఉంది. దేశంలో ప్రైవేటు రంగంలో ఇంగ్లిషు, ప్రభుత్వ రంగాల్లో ప్రాంతీయ భాషలు పెట్టుకువచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వేల ఏండ్లు చదువుకునే హక్కులేక  ప్రపంచంలోనే ఆఫ్రికా కంటే విద్యారంగంలో వెనుకబడ్డ పరిస్థితి ఉంది. 

గ్రామాలకు సింగిల్ టీచర్ స్కూళ్లు రావడానికి చాలాకాలం పట్టింది. ఇప్పడు  విద్యా వ్యవస్థ ఒక  క్రైసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది. అది టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గరి నుంచి, యూనివర్సిటీ ప్రొఫెసర్ల నియామకం వరకు గ్రామీణ వ్యవస్థకు వ్యతిరేక సిలబస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పాతకాలపు కుల విలువలతో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు కుల విలువలతో నడవాలని ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కేంద్రీకృత వ్యవస్థను నిర్మించింది.

ఆ వ్యవస్థలు ఊహించని మార్పులు తెచ్చాయి. విద్యావ్యవస్థను ఒకే ఐడియాలజీతో నడిపిన ఏ దేశం సైన్సు, టెక్నాలజీని, ఆధునిక వ్యవసాయిక, పారిశ్రామిక వ్యవస్థను నిర్మించుకోలేకపోయింది. మన దేశంలో 34 ఏండ్లు  ఏకకాలంగా బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని పరిపాలించిన కమ్యూనిస్టు పార్టీలు యూనివర్సిటీలను తమ పార్టీ సిద్ధాంతంలో పెంచి పోషించినవారిని తప్ప మరొక ఆలోచనను యూనివర్సిటీల్లో చేరనివ్వలేదు.  ఆ కాలంలో ఎంతో పేరున్న బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  విద్యావ్యవస్థ సర్వనాశనమైపోయింది. ఆ రాష్ట్రం వెనుకబడిపోయింది.

నిరుద్యోగులుగా లక్షలాది మంది యువత
ఇప్పుడు ఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఐడియాలజీతో ఉన్నవారిని తప్ప వేరేవారిని యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా నియామకాలు చేయలేని పరిస్థితులు జరుగుతూ వస్తున్నాయి. ఓపెన్ కాంపిటీషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లను నియమించకపోతే ఆ యూనివర్సిటీల్లో ప్రపంచ పోటీ జ్ఞానం అభివృద్ధి కాదు. దీనికితోడు అన్ని రంగాల్లో నిరంతరంగా ఉద్యోగ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు జరుగుతూ పోవాలి.

ఉన్నత విద్యలో రాణించినవారికి ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుందనే నమ్మకం లేకపోతే విద్యార్థులు చదువు వల్ల ప్రయోజనం ఏంది?  అనే ప్రశ్నను ఎదుర్కొంటారు. ఆ స్థితిలో లక్షలాది మంది భారతదేశ యువకులు నిరుద్యోగులుగా కొట్టుమిట్టాడుతున్నారు. గ్రామాల్లో ఉండలేరు. పట్టణాల్లో బతకలేరు. పెళ్లిళ్ల ఒత్తిళ్లు, బతుకుదెరువులేని బతుకులు.

ఈ స్థితిలో ఉన్నవారిని వీళ్లంతా బొద్దింకలు, సోమరిపోతులు అని ఎద్దేవా చేస్తే ఆ యువతీ యువకులు ఏం చేయాలి ? ఇక్కడే అభిజిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీప్కే ఒక ఆశాజనకంగా బయటకొచ్చాడు.  మేం బొద్దింకలమే కాని సోమరిపోతులం కాదు. మేం రాత్రింబవళ్లు కష్టపడే బొద్దింకలం. మేం కిచెన్ సింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకుంటాం. మా తెలివి ఏందో చూపిస్తం.  మేం ఎందుకు  నిరుద్యోగులం అవుతున్నామో ప్రపంచానికి తెలియచెబుతాం. మేం జెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీ  బొద్దింకలం. ఇప్పుడు చూపిస్తాం మా తడాఖా అని సవాలు చేశారు. 

ఇప్పడు ఏం చేయాలి ?
యూనివర్సిటీ విద్యను పూర్తిగా సంస్కరించాల్సిన అవసరం ఉన్నది. ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తిగా ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంపిటీషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరగాలి. పాతకాలం ఆలోచనలు, కుల వీలులేని ఒక సెక్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థలుగా మార్చకపోతే దేశం మునుముందు ఈ జెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీ బొద్దింకలను ప్రతి రోజూ ఎదుర్కోక తప్పదు. కుల వీలులేకపోవడమంటే రిజర్వేషన్లు వద్దని కాదు. అవి కూడా పోటీలో జరగాలి. ఎంత కృషి చేసినా త్రేతాయుగ సంస్కృతిలోకి 21వ శతాబ్దపు యువతీ యువకులను తీసుకెళ్లలేరు.

బాగా బీజేపీ, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ఎస్ మద్దతుదారు కుటుంబాలలోని యువతీ యువకులను కూడా ప్రంపచ సంస్కృతి, ప్రపంచ విలువలు, ప్రపంచ జ్ఞానంతో పెరుగుతున్న రోజులివి. వీళ్లు పుట్టుకతోనే వారి ఇండ్లలోనే ఆపిల్ ఫోనుతో పెరిగి పెద్దోళ్లు అవుతున్నారు. బీదవాళ్లు అయితే ఒప్పో ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పెరుగుతున్నారు. 

వాటిని ఈ దేశం ఇంకా కనిపెట్టే విద్యా వ్యవస్థ రూపొందలేదు. ఆ స్థితిలో వారి ప్రపంచ జ్ఞానాన్ని ఒక ప్రాంతానికి జంతర్ మంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద చూశాం. ఈ జెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీ బొద్దింకలు ఇక దేశాన్ని వెనక్కి పోనివ్వకుండా దేశం ముందు ఒక ఆశాజ్యోతిని వెలిగించి చూపించారు.

ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్​

  • ఓపెన్​పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com
  • రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
  • స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.