మీనరాశి ఆగస్టు నెల జాతకం .. కొత్త వ్యాపారాలకు బాగా అనుకూలం.. జాబ్ మారేందుకు మంచి అవకాశం ఇదే..!

మీనరాశి ఆగస్టు నెల జాతకం ..  కొత్త వ్యాపారాలకు బాగా అనుకూలం.. జాబ్ మారేందుకు మంచి అవకాశం ఇదే..!

మీన రాశి వారికి ఆగస్టు నెల ప్రారంభంలో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో కొత్త వ్యాపారం ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. జాబ్​ మారాలనుకొనే వారికి ఈ నెల మంచి అవకాశమని పండితులు చెబుతున్నారు. 

మీన రాశి వారికి ఆగస్టు నెల సానుకూల మార్పులతో ప్రారంభమవుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి అనుకూలమైన కాలమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం, సూర్యుడు, బుధుల అనుకూలత పెరగడం వంటి కారణాల వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందే అవకాశముంది.  

 గ్రహాల సంచారం ఆధారంగా ఆగస్టు నెల మకరరాశి ఉద్యోగస్తులకు  పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది.పాత బకాయిలు వసూలవుతాయి.  జీవిత భాగస్వామితో ఆనందంగా గడిపే సమయం లభిస్తుంది. పాత బకాయిలు వసూలవుతాయి.  ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదు. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో  సమయం గడిపే అవకాశం ఉంది.

విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయయోగం కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే... ఆగస్టులో . వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి. వివాహ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలను సొంత ఆలోచనలతో నిర్వ హించుకుని లబ్ధి పొందడం జరుగుతుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి.  ముఖ్య మైన పనులు, వ్యవహారాలు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. 

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో చక్కని ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు బాగా ఉత్సాహంగా సాగుతాయి. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

పరిహారం : ప్రతి శనివారం ఆవ నూనె దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శని సాడేసతి నుంచి ఉపశమనం లభిస్తుంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.