సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 4500. తెలంగాణలో 100 ఖాళీలు ఉన్నాయి.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 2022, జనవరి 1 కంటే ముందు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి: 20 నుంచి 28 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జూన్ 12.
అప్లికేషన్ ఫీజు: జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.944. జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ మహిళా అభ్యర్థులకు రూ.708. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ట్రాన్స్ జెండర్లకు రూ.236.
లాస్ట్ డేట్: జూన్ 22.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక
చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ centralbank.bank.inను సందర్శించండి.
