TG20 League 2026: తెలంగాణ గల్లీ క్రికెటర్లలో దాగున్న టాలెంట్‌ను బయటకు తీసేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఒక కిర్రాక్ ప్లాన్ వేసింది. అదే ప్రతిష్ఠాత్మక టీజీ20 లీగ్ (TG20 League 2026). జూన్ 21 నుంచి ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ క్రికెట్ పోరు షురూ కాబోతోంది. లీగ్‌ను మరింత క్రేజీగా మార్చేందుకు రౌడీ హీరో విజయ్ దేవరకొండని బ్రాండ్ అంబాసిడర్‌గా సెలక్ట్ చేశారు. ఇంకేముంది అంచనాలు అప్పుడే పీక్స్‌కి వెళ్ళిపోయాయి.
ట్యాంక్‌బండ్‌పై ట్రోఫీతో రచ్చ:
లీగ్ స్టార్ట్ కావడానికి కొన్ని రోజులే సమయం ఉండటంతో సిటీలో ప్రమోషన్స్ గట్టిగా నడుస్తున్నాయి. రేపు (జూన్ 17న) ట్యాంక్‌బండ్‌పై మెరిసిపోయే విన్నర్స్ ట్రోఫీని గ్రాండ్‌గా ఆవిష్కరించనున్నారు. రీసెంట్‌గా నెక్లెస్ రోడ్‌లో చేసిన క్రేజీ డ్రోన్ డిస్ప్లే షోలో జట్ల లోగోలను రిలీజ్ చేసి అప్పుడే ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించారు. ఇక జూన్ 21న ఉప్పల్ స్టేడియంలో జరగబోయే ఓపెనింగ్ సెర్మనీ మామూలుగా ఉండదు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ (Thaman) మ్యూజికల్ కాన్సర్ట్‌తో పాటు నెక్స్ట్ లెవెల్ లేజర్ షో ప్లాన్ చేశారు.
విన్నర్ టీమ్ కి రూ. కోటి ప్రైజ్ మనీ:
ఈ లీగ్‌లో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. ప్రతి టీమ్ మిగతా అన్ని జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది (రౌండ్-రాబిన్ ఫార్మాట్).. ప్రైజ్ మనీ కూడా భారీ ప్రకటించారు.
* కప్ గెలిచిన టీమ్‌కు (Winner): రూ. 1 కోటి
* రన్నరప్ (Runner-up) కి: రూ. 50 లక్షలు
* 3, 4 ప్లేస్‌లలో నిలిచే జట్లకు: రూ. 25 లక్షల చొప్పున ప్రైజ్ మనీ
ఐపీఎల్‌లోని క్రేజీ రూల్:
ఐపీఎల్‌లో ఉండే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తప్ప మిగతా అన్ని ఐపీఎల్ రూల్స్ ఈ లీగ్‌లోనూ ఉంటాయి. పైగా మ్యాచ్ టికెట్ ధరలు కేవలం రూ. 50, రూ. 100 మాత్రమే ఉండనున్నాయి. డిస్ట్రిక్ట్ యాప్ (District App)లో అందుబాటులో ఉన్నాయి.
►ALSO READ | శ్రేయస్ను పక్కన పెట్టి సూర్యను పెట్టారేంటి.. సోనీ స్పోర్ట్స్పై నెటిజన్స్ ఫైర్
ఫస్ట్ ఫైట్ ఖమ్మం వర్సెస్ పాలమూరు:
టోర్నీ ఫస్ట్ మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్, అన్విత ఖమ్మం ఏసెస్ జట్లు ఢీకొట్టబోతున్నాయి. ఇక రామోజీ గ్రూప్‌నకు చెందిన ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ఓన్ చేసిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ (Hyderabad e Champions) టీమ్.. జూన్ 23న పాలమూరు స్ట్రైకర్స్‌తో తన ఫస్ట్ మ్యాచ్ ఆడనుంది. బేగంపేట్ ఈవెంట్‌లో హెచ్‌సీఏ సెక్రటరీ జీవన్ రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ఆగం రావు ఈ వివరాలన్నీ లీక్ చేశారు.
The countdown continues as Telangana gets ready to welcome its first-ever franchise T20 league.
— Manne Jeevan Reddy (@ManneReddy11019) June 16, 2026
In just 5 days, players from across the state will take the field, represent their regions, and begin their journey in TG20.
A new chapter in Telangana cricket begins on June 21. pic.twitter.com/8b89o3BnNN
