India vs England promo: భారత టీ20 జట్టు కెప్టెన్సీ లొల్లి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బీసీసీఐ (BCCI) ఊహించని విధంగా సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి.. అతని ప్లేస్‌లో శ్రేయస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా ప్రకటించింది. ఈ ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్ల కోసం కొత్త టీమ్ ని ప్రకటించింది. అఫీషియల్ బ్రాడ్‌కాస్టర్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (Sony Sports Network) చేసిన ఒక పెద్ద పొరపాటుపై ఇప్పుడు నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
కొత్త కెప్టెన్‌కు నో ఛాన్స్.. పాత కెప్టెన్‌తో ప్రోమో:
ఈరోజు (జూన్ 16, మంగళవారం) మధ్యాహ్నం 12:18 గంటలకి సోనీ స్పోర్ట్స్ ఇంగ్లాండ్ సిరీస్ కోసం భారీ హైప్ ఇచ్చేలా విడుదల చేసిన ప్రోమో వీడియోను ఎక్స్ (X) లో పోస్ట్ చేసింది. గత ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ విజువల్స్‌ను వాడుకుంటూ ఈ వైట్-బాల్ సిరీస్ కోసం బిల్డప్ ఇచ్చింది. కానీ, ఇక్కడే సోనీ టీమ్ ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ చేసింది. టీమిండియా లేటెస్ట్ అప్‌డేట్స్‌ను మర్చిపోయి.. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విజువల్స్ పెట్టకుండా, మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను మెయిన్ ఫేస్‌గా చూపిస్తూ ప్రోమో వదిలింది.
ప్రోమోలో లేని అయ్యర్.. మీమ్స్‌తో ఫ్యాన్స్ లొల్లి:
ఈ వీడియో కాస్తా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దాంతో క్రికెట్ ఫ్యాన్స్ బీసీసీఐ ఏమో సూర్యను కెప్టెన్సీ నుంచి తీసేస్తే.. సోనీ స్పోర్ట్స్ ఏమో ప్రోమో నుంచి కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను తీసేసి సూర్యను తెచ్చిందంటూ మీమ్స్ వేసి జోకులు పేల్చారు. ఫ్యాన్స్ తప్పును ఎత్తిచూపడంతో అలర్ట్ అయిన సోనీ స్పోర్ట్స్.. వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసింది. ఇప్పటి వరకు కొత్త ప్రోమో అయితే రాలేదు కానీ, తప్పును సరిదిద్దుకుని త్వరలోనే కొత్తది రిలీజ్ చేయనున్నారు.
►ALSO READ | ఫిఫా వరల్డ్ కప్‌లో కోహ్లీ హవా.. విరాట్ వరల్డ్ కప్ గెలుస్తాడా? అంటూ ఫ్యాన్ టార్చర్.. ఐషోస్పీడ్ ఏం చేశాడంటే!
కావాలనే శ్రేయస్‌ను పక్కన పెట్టలేదు:
సాధారణంగా భారత్ లో జరిగే హోమ్ మ్యాచ్‌ల బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ స్టార్ స్పోర్ట్స్ (Star Sports) దగ్గర ఉన్నాయి. కొత్త కెప్టెన్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ గత చాలా కాలంగా ఇండియా తరఫున టీ20 మ్యాచ్‌లు ఆడలేదు.. దాంతో సోనీ స్పోర్ట్స్ దగ్గర శ్రేయస్ బ్లూ జెర్సీలో ఉన్న విజువల్స్ ఏవీ అందుబాటులో లేవు.. అందుకే వాళ్లు సూర్యకుమార్ యాదవ్ ఫుటేజ్‌ని వాడాల్సి వచ్చింది.
ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లే టీమిండియా:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ.
Sony Sports Network ke TV channels pe…📺
— Sony Sports Network (@SonySportsNetwk) June 16, 2026
England apne ghar mein khelega.🏏
Aur Team India apne dum par.🔥
Watch #ENGvIND starting 1st July, LIVE on Sony Sports Network TV channels 📺#SonySportsNetwork #MamlaPersonalHai pic.twitter.com/mnXqW7hhCV
