Gautam Gambhir: 2027 వన్డే వరల్డ్ కప్ కోసం భారత్ ప్రత్యేక వ్యూహం.. సన్నాహాలు స్టార్ట్ అయ్యేది అప్పుడే! 

Gautam Gambhir: 2027 వన్డే వరల్డ్ కప్ కోసం భారత్ ప్రత్యేక వ్యూహం.. సన్నాహాలు స్టార్ట్ అయ్యేది అప్పుడే! 

Gautam Gambhir: టీ20 వరల్డ్ కప్ 2026ని భారత జట్టు కైవసం చేసుకుంది. ఇప్పుడు టీమిండియా దృష్టి మొత్తం రాబోయే సంవత్సరం జరగనున్న వన్డే వరల్డ్ కప్ పై మాత్రమే ఉంది. దీంతో ఇండియన్ టీమ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 ముగిసిన తర్వాత వన్డే వరల్డ్ కప్ 2027 సన్నాహకాలు స్టార్ట్ ప్రారంభమవుతాయని వెల్లడించాడు. అప్పుడే బ్లూ ప్రింట్ రెడీ చేసుకుంటామని తెలియజేశాడు. 

వన్డే ప్రపంచ కప్ 2027 కోసం సన్నాహాలు ఐపీఎల్ ముగిసిన తర్వాతనే స్టార్ట్ కానున్నాయి. ఐపీఎల్ 2026 నుంచి వన్డే వరల్డ్ కప్ వరకు దాదాపు 25 నుంచి 30 వన్డే మ్యాచ్ లు జరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఈ ఫార్మాట్లో ఎక్కువగా మ్యాచ్ లు జరగడం లేదు.. ఎంత త్వరగా ప్లాన్స్ సిద్ధం చేసుకుంటే.. అంత మంచిది' అని గౌతీ ఓ ఇంటర్వ్యూలో అన్నాడు. అలాగే వన్డే మెగా టోర్నమెంట్ జరగనున్న  దక్షిణాఫ్రికా– జింబాబ్వే– నమీబియా దేశాల్లో సంయుక్తంగా నిర్వహిస్తున్న  పిచ్ ల గురించి కూడా ఆయన మాట్లాడుతూ.. సౌతాఫ్రికాలో క్రికెట్ ఆడటం అంత ఈజీ కాదు.. అక్కడి పరిస్థితులకు తగ్గట్లు ఆడే ప్లేయర్స్ ని గుర్తించి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.. వరల్డ్ కప్ కి ఆటగాళ్ల ఎంపిక సెలెక్టర్లు, కోచ్ ఆ పని చూసుకుంటారని గౌతమ్ గంభీర్ వెల్లడించాడు.  

►ALSO READ | KKR Opening Pair: వరల్డ్ కప్‌లో బెస్ట్ ఓపెనింగ్ జోడీని జస్ట్ రూ. 3.50 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్

ఇదిలా ఉండగా, 2027 వన్డే వరల్డ్ కప్ లో ఆడేందుకు టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దృష్టి పెట్టారు. జూన్ 14వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ తో మూడు వన్డేల సిరీస్‌తో భారత్ తిరిగి 50 ఓవర్ల ఫార్మాట్‌లోకి  అడుగు పెడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ తర్వాత టీమిండియా మరో మూడు మ్యాచ్‌ల కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లనుంది. ఈ మ్యాచ్‌ల్లో ప్రదర్శన తర్వాతే వీరి భవిష్యత్తు ఆధారపడి ఉంది. కోహ్లీ ఇటీవల వన్డే ఫార్మాట్లో మంచి ఫామ్‌ కనబరుస్తున్నాడు. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లపై అద్భుతమైన పరుగులు చేయగా.. రోహిత్ శర్మ మాత్రం తిరిగి బలంగా పుంజుకోవాలని నిశ్చయించుకున్నట్లు కనిపిస్తున్నాడు. ఇప్పటికే అతడు బరువు తగ్గడంతో పాటు ముంబైలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. అంతర్జాతీయ క్రికెట్ లోకి తిరిగి రాకముందు, రోహిత్, కోహ్లీ ఇద్దరూ IPL 2026 సీజన్‌లో వారి వారి ఫ్రాంచైజీల తరపున ఆడనున్నారు.