ప్రధాని మోడీ వార్నింగ్.. జెన్ జీపై దెబ్బకు రూటు మార్చేసిన MP కంగనా..!

ప్రధాని మోడీ వార్నింగ్.. జెన్ జీపై దెబ్బకు రూటు మార్చేసిన MP కంగనా..!

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జంతర్ మంతర్ దగ్గర యువత చేపట్టిన నిరసనలను బీజేపీ ఫైర్ బ్రాండ్, ఎంపీ కంగనా రనౌత్ తీవ్రంగా విమర్శించారు. నిరసన తెలిపిన జెన్ జీ యువతను ‘గట్టర్ జనరేషన్’ (మురికికాల్వ తరం) అంటూ నోరుపారేసుకున్నారు. దీంతో కంగనా రనౌత్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నీట్ పేపర్ లీక్ కావడంతో 21 మంది విద్యార్థులు చనిపోగా.. లీకేజీకి వ్యతిరేకంగా యువత ధైర్యంగా ముందుకొచ్చి నిరసన తెలిపితే మురికి అంటూ విమర్శిస్తావా అని ఎంపీని ఏకీపారేశారు నెటిజన్లు. 

బీజేపీ హైకమాండ్ కూడా కంగనా వ్యాఖ్యలను తప్పబట్టినట్లు తెలిసింది. ఓ సోషల్ మీడియాలో.. మరోవైపు పార్టీ నుంచి వ్యతిరేక రావడంతో కంగనా యూటర్న్ తీసుకున్నారు. జెన్ జీపై ఒంటికాలిపై లేసిన ఫైర్ బ్రాండ్.. తాజాగా జెన్ జీ యువతపై ప్రశంసల వర్షం కురిపించింది. జెన్ జీ యువత ఇండియాకు అతిపెద్ద బలమని ఆమె అభివర్ణించారు. తమకు జరిగిన అన్యాయంపై నిర్భయంగా గళం విప్పుతోన్న జెన్ జీ యువతను చూసి దేశం గర్విస్తోందని ఆకాశానికెత్తారు.

 దేశంలో బీజేపీ అప్రతిహతంగా 12 ఏళ్లు అధికారంలో కొనసాగడానికి జెన్ జీ యువత ఇచ్చిన తీర్పే ప్రధాన కారణమని పేర్కొన్నారు. అయితే, నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో కేవలం 10-15 మంది చేసిన తప్పుడు ప్రవర్తన ఆధారంగా మొత్తం తరాన్ని తప్పుబట్టడం సరికాదన్నారు. పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జార్ఖండ్‌లో విద్యార్థులు ఎంతో శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. 

 మోడీ వార్నింగ్‎తో కంగనా యూటర్న్:

జెన్ జీ నిరసనలపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేసిన కంగనా రనౌత్ ఆల్ ఆఫ్ సడెన్‎గా తన స్వరం మార్చుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, ప్రధాని మోడీ వార్నింగ్, బీజేపీ హైకమాండ్ ఆదేశాల మేరకు జెన్ జీ విషయంలో ఆమె యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. జెన్ జీ నిరసనల అనంతరం ప్రధాని మోడీ ఎన్డీఏ ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించారు.

 ఈ భేటీలో జెన్ జీ యువతపై, ప్రతిపక్షాలపై పరుష పదజాలం వాడొద్దని తమ ఎంపీలకు మోడీ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని.. జెన్ జీ యువతకు దగ్గర కావాలని సూచించారు. దీంతోనే కంగనా తన వైఖరిని మార్చుకుని.. ఉన్నఫలంగా జెన్ జీపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది.