Hardik Pandya: ఐపీఎల్ 2027 (IPL 2027) ఆరంభానికి ముందే లీగ్‌లో ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల మార్పిడి (Trades)కి సంబంధించిన వార్తలు క్రికెట్ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టు మారబోతున్నాడనే వార్త కథనాలు జోరందుకున్నాయి. గత కొన్ని వారాలుగా హార్దిక్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులోకి వెళ్లబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
కేకేఆర్ తో డీల్ పై ఆర్. అశ్విన్ రియాక్షన్:
హార్దిక్ పాండ్యా ట్రెడ్ డీల్ పై భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా విశ్లేషించాడు. ముంబై ఇండియన్స్ ఒకవేళ హార్దిక్‌ను కేకేఆర్‌కు వదులుకోవాల్సి వస్తే, దానికి బదులుగా సమర్థులైన ఆటగాళ్లను ప్రతిఫలంగా తీసుకోవాలని సూచించాడు. కేకేఆర్ నుంచి క్యామెరాన్ గ్రీన్‌ను తీసుకోవడం కంటే మెరుగైన ఆఫర్ కోసం డిమాండ్ చేయాలని అభిప్రాయపడ్డాడు.
ఆ ఇద్దరు ప్లేయర్లను ఇస్తేనే కేకేఆర్‌కు హార్దిక్‌ను ఇవ్వాలి:
ఈ ట్రేడింగ్ అంశంపై అశ్విన్ మాట్లాడుతూ.. ఒకవేళ క్యామెరాన్ గ్రీన్ వచ్చే ఏడాది జరగబోయే యాషెస్ సిరీస్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంటే ముంబై పరిస్థితి ఏంటి? అందుకే నేను గనుక ముంబై జట్టు స్థానంలో ఉంటే, ఒకే ఒక్క షరతుపై కేకేఆర్‌తో డీల్‌కు ఒప్పుకుంటాను.. హార్దిక్ పాండ్యాకు బదులుగా కేకేఆర్ నుంచి హర్షిత్ రాణా, రింకూ సింగ్ ఇద్దరినీ ప్రతిఫలంగా తీసుకోవాలని సూచించాడు. అప్పుడే ముంబై ఇండియన్స్ మరింత బలపడుతుంది. మరోవైపు సీఎస్కే శివమ్ దూబేతో పాటు ఒక పేసర్‌ను ఆఫర్ చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయని పేర్కొన్నాడు.
Also Read : భారత ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త ఫిట్‌నెస్ రూల్స్
ఐపీఎల్‌లో హార్దిక్ పాండ్యా ట్రాక్ రికార్డు:
ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో హార్దిక్ పాండ్యా ఒకడిగా నిలిచాడు. ఇప్పటి వరకు ఆడిన 162 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో హార్దిక్ 2,955 రన్స్ చేయడమే కాకుండా 82 వికెట్లు పడగొట్టాడు. గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుకు తొలి సీజన్లోనే ట్రోఫీ అందించి, ఆ తర్వాత వరుసగా రెండో ఏడాదీ ఫైనల్‌కు తీసుకెళ్లిన అనుభవం అతనికి ఉంది. ఆ తర్వాత తిరిగి ముంబై ఇండియన్స్‌లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటికీ, కెప్టెన్‌గా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2027లో హార్దిక్ ప్రయాణం ఏ జట్టుతో కొనసాగుతుందో చూడాల్సి ఉంది.
R Ashwin’s big statement on Hardik Pandya trade rumours after IPL 2026 👀#HardikPandya #RAshwin pic.twitter.com/G2LlXCGN5n
— CricTracker (@Cricketracker) August 7, 2026
