కాకమిగహరా (జపాన్): ఆసియా క్రీడల్లో ఇండియా మెన్స్ హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. మంగళవారం జరిగిన పూల్–ఎ రెండో మ్యాచ్‌లో ఇండియా 16–1తో శ్రీలంకపై గెలిచింది. డ్రాగ్ ఫ్లికర్ జుగ్‌రాజ్ సింగ్ (10, 22, 42, 53వ నిమిషం), అభిషేక్ (11, 17, 49వ ని), దిల్‌ప్రీత్ (30, 38, 55వ ని) హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (16, 45వ ని), మన్‌దీప్ సింగ్ (5వ ని), సుఖ్‌జీత్ సింగ్ (29వ ని), మన్‌ప్రీత్ సింగ్ (31వ ని), వివేక్ సాగర్ ప్రసాద్ (36వ ని) గోల్స్ కొట్టారు. సురేశ్ రత్నాయకే (50వ ని) లంకకు ఏకైక గోల్ అందించాడు. ఆసియా గేమ్స్ చరిత్రలో ఇండియాపై లంకకు ఇదే తొలి గోల్ కావడం గమనార్హం.
