ఏసియన్ గేమ్స్: బ్యాడ్మింటన్‌‌లో ఇండియా మెన్స్‌‌ జట్టుకు పతకం ఖాయం

ఏసియన్ గేమ్స్: బ్యాడ్మింటన్‌‌లో ఇండియా మెన్స్‌‌ జట్టుకు పతకం ఖాయం

నగోయా: బ్యాడ్మింటన్‌‌లో ఇండియా మెన్స్‌‌ జట్టుకు పతకం ఖాయమైంది. క్వార్టర్‌‌ఫైన్లలో ఇండియా 3–0తో జపాన్‌‌పై గెలిచి సెమీస్‌‌లోకి అడుగుపెట్టింది. తొలి సింగిల్స్‌‌లో లక్ష్యసేన్‌‌ 11–21, 21–5, 21–19తో కొడై నరోకాపై గెలిచాడు. మెన్స్‌‌ డబుల్స్‌‌లో సాత్విక్‌‌–చిరాగ్‌‌ జోడీ 21–18, 24–22తో హోకీ తకురో–కొబయాషి యుగోపై నెగ్గారు. 

మూడో మ్యాచ్‌‌లో ఆయుశ్‌‌ షెట్టి 21–10, 21–19తో కొకి వతనాబేను ఓడించాడు. విమెన్స్‌‌ క్వార్టర్‌‌ఫైనల్లో ఇండియా 1–3తో జపాన్‌‌ చేతిలో ఓడింది. అకానె యమగుచితో జరిగిన మ్యాచ్‌‌లో పీవీ సింధు పోరాడి ఓడింది. ట్రిసా జోలీ–గాయత్రి గోపీచంద్‌‌ మెరుగ్గా ఆడినా మిగతా మ్యాచ్‌‌ల్లో ఇండియా ప్లేయర్లు నిరాశపర్చారు.