హైదరాబాద్‌లో చిలకలూరిపేట యువతి అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌లో చిలకలూరిపేట యువతి అనుమానాస్పద మృతి

హైదరాబాద్: హైదరాబాద్‌లో చిలకలూరిపేట యువతి అనుమానాస్పద మృతిలో చనిపోయింది. వారం క్రితం హైదరాబాద్ వచ్చిన ఆషా.. ప్రియుడితో కలిసి హైదరాబాద్ మొయినాబాద్‌లో ఉంటోంది. సుల్తాన్-, ఆషా కొన్నాళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. సుల్తాన్ మెయినాబాద్‌లో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. సుల్తాన్ ఇంట్లో లేని సమయంలో ఆషా ఉరేసుకుని చనిపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది.

ఆషా డెడ్ బాడీని హైదరాబాద్ నుంచి అంబులెన్స్లో చిలకలూరిపేటకు తీసుకొచ్చాడు. అంబులెన్స్ డ్రైవర్కు ఇప్పుడే వస్తానని చెప్పి పరారయ్యాడు. దీంతో.. అంబులెన్స్ డ్రైవర్ భయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సుల్తాన్ పర్చూరు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు.

ఇలాంటి ఘటనే పల్నాడు జిల్లాలో మరొకటి జరిగింది. ప్రేమించిన యువతిని అనుమానంతో హత్య చేసిన ఘటన కారంపూడి మండలం చింతపల్లిలో జరిగింది. కారంపూడి మండలం ఇనుపరాజుపల్లెకు చెందిన బాల సైదులు, చిలకలూరిపేటకు చెందిన యువతి షేక్ హసీనా ప్రేమించుకున్నారు. మాట్లాడుకుందామని పిలిచి నాగార్జునసాగర్ కుడి కాలువ దగ్గర ఆమెను హత్య చేశాడు. గుంటూరులోని ఒక ప్రైవేటు కాలేజ్లో సైదులు బీటెక్ చదువుతున్నాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.