సౌత్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న యంగ్ హీరో రెమ్యునరేషన్.. రూ. 50 కోట్లు ఆఫర్ చేసిన బడా నిర్మాణ సంస్థ?

సౌత్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న యంగ్ హీరో రెమ్యునరేషన్.. రూ. 50 కోట్లు ఆఫర్ చేసిన బడా నిర్మాణ సంస్థ?

సెన్సేషనల్ యాక్టర్ గా,  డైరెక్టర్ గా ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక బ్రాండ్‌గా మారిపోయారు. 'కోమాలి'తో దర్శకుడిగా, 'లవ్ టుడే'తో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మేనరిజం సెట్ చేసుకున్న ఈ యంగ్ హీరో కోసం ఇప్పుడు బడా నిర్మాణ సంస్థలు క్యూ కడుతున్నాయి. లేటెస్ట్ గా టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రదీప్‌తో మరో భారీ ప్రాజెక్ట్‌ను సెట్ చేసినట్లు తెలుస్తోంది.

 ఏకంగా రూ. 50 కోట్లు!

ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ ప్రదీప్ రంగనాథన్‌కు ఏకంగా రూ. 50 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు ఫిల్మ్ నగర్ సర్కీల్ లో చర్చించుకుంటున్నారు.  ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఆయనకున్న క్రేజ్ చూస్తుంటే ఇది సాధ్యమే అనిపిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం కొంత అడ్వాన్స్ కూడా ఆయన ఖాతాలోకి చేరిందని టాక్. గతంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన 'డ్యూడ్' (Dude) సినిమా కోసం ప్రదీప్ దాదాపు రూ. 13 కోట్లు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ సినిమా మొత్తం బడ్జెట్ రూ. 26 కోట్లు కాగా రూ. 100 కోట్లకు పైగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టింది.  ఇప్పుడు ఆ క్రేజ్ తోనే ఏకంగా డబుల్ చేసి రూ. 50 కోట్లు ఆఫర్ చేయడం కోలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఎందుకీ క్రేజ్?

ప్రదీప్ రంగనాథన్ బలం ఆయన కంటెంట్. నేటి తరం యువతకు ఏం కావాలో, సోషల్ మీడియా యుగంలో ప్రేమకథలు ఎలా ఉంటాయో ఆయన పట్టుకున్న తీరు అద్భుతం. అందుకే ఆయన నటించిన 'లవ్ టుడే', 'డ్రాగన్','డ్యూడ్' చిత్రాలు ఒకదానిని మించి ఒకటి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. నిర్మాతలకు మినిమం గ్యారెంటీ హీరోగా మారడంతో, ఆయన డిమాండ్ ఆకాశాన్నంటింది.

రాబోయే సినిమాలు ఇవే..

ప్రస్తుతం ప్రదీప్ చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK): విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. సొంత దర్శకత్వంలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ప్రదీప్ మళ్లీ మెగాఫోన్ పట్టబోతున్నారు. ఇది ఏకంగా రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుందని టాక్.  అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో వచ్చిన 'డ్రాగన్' సూపర్ హిట్ కావడంతో, దీనికి సీక్వెల్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ కొత్త ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా లెవల్లో నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ గనుక సెట్ అయితే, అది బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.. అయితే దీనిపై మేకర్స్ నుంచి. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.