ఢిల్లీ: ఆరావళి పర్వతాల్లో గనుల తవ్వ కాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై నవంబర్ లో తాను ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. స్థానిక భూమి ఉపరిత లం నుంచి 100 మీటర్లు లేదా అం తకుమించి ఎత్తున ఉన్నవి మాత్రమే ఆరావళి పర్వతాలుగా పరిగణించబడ తాయని గతంలో తీర్పు ఇచ్చింది. అం తకన్నా తక్కువ ఎత్తున ఉన్నవి ఆరావళి పర్వత శ్రేణుల పరిధిలోకి రావంటూ ఇచ్చిన తీర్పును పునః సమీక్షించింది. ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా నిరసనలుచేలరేగాయి.
ఈ నేపథ్యంలో ఈ వ్య వహారాన్ని సుమోటోగా స్వీకరించిన జస్టిస్ సూర్యకాంత్, జె.కె. మహేశ్వరి, ఎ.జి. మాసిహ్లితో కూడిన సుప్రీం బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ అంశాలను పరిశీలించడానికి కొత్త నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. అంతేకాదు, ఈ అంశంపై సుమోటోగా దాఖలైన కేసుపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆరావళి రాష్ట్రాలైన రాజస్థా న్, గుజరాత్, ఢిల్లీ, హర్యానాకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 21కి వాయిదా వేసింది.
►ALSO READ | జనవరి 2026లో బ్యాంకులకు వరుస సెలవులు.. పండగలు, ఆదివారాలు కలిపి ఈ రోజుల్లో బంద్..
