రాబోయే మూడేండ్లలో నల్గొండ పట్టణంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు: మంత్రి కోమటిరెడ్డి

రాబోయే మూడేండ్లలో నల్గొండ పట్టణంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ: రాబోయే మూడేండ్లలో నల్గొండ పట్టణంలో ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ ఇల్లు  కట్టిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం (మార్చి 16) నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్ మదీనా మజీద్‎లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. మంత్రి కోమటిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రంజాన్ పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏకైక సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కేంద్రంలోని బీజేపీ కులమతాలను రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. సంవత్సరానికి 2 కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

దివంగత నేత వైఎస్ఆర్ హయాంలోనే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యాయని గుర్తు చేశారు. నల్లగొండ పట్టణంలో గత 30 సంవత్సరాలుగా హిందూ ముస్లింలంతా కలిసిమెలిసి ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకుంటున్నారని అన్నారు. ముస్లింలంతా రంజాన్ పండుగను ప్రశాంత వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.