- గుండెపోటు రావడంతో హాస్పిటల్ కు తరలించిన పోలీసులు
సూర్యాపేట, వెలుగు : సీఎంఆర్ కేసులో మిల్లు నిర్వాహకురాలిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తుండగా గుండెపోటుతో కుప్పకూలడంతో హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటన గురువారం సూర్యాపేట జిల్లాలో జరిగింది.
మేళ్లచెర్వు మండలంలో శ్రీ శ్రీనివాస సాయి శివాయ రైస్ ఇండస్ట్రీస్‌లో సుమారు రూ. 48 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు ఆఫీసర్లు గుర్తించారు. మిల్లు నిర్వాహకులు చెన్నారెడ్డి, అతడి భార్య రాజ్యలక్ష్మి, కూతురు శ్వేత, సాముల జైపాల్ రెడ్డి మరియు అతడి కోడలిపై మేళ్లచెర్వు పీఎస్ కేసు నమోదైంది. గురువారం పోలీసులు రాజ్యలక్ష్మిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తుండగా గుండెపోటు రావడంతో సూర్యాపేటకు తరలించారు.
