శ్రీశైలంలో రెండో రోజు వరుణయాగ సహిత సహస్ర ఘట్టాభిషేకం పూజలు...

శ్రీశైలంలో రెండో రోజు వరుణయాగ సహిత సహస్ర ఘట్టాభిషేకం పూజలు...

శ్రీశైలం మల్లన్న ఆలయంలో వరుణయాగ సహిత సహస్ర ఘట్టాభిషేకం పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా  శనివారం ( ఆగస్టు 8 ) రెండోవరోజు ఋష్యశృంగజపం,వారుణానువాక పారాయణలు,వరుణజపం, భాగవత,విరాటపర్వ పారాయణలు,పంచాక్షరీజపం జరిపించారు. 

ఇవాళ్టి  నుండి 11వ తేదీ వరకు గణపతి హోమం,రుద్రహోమం,మృత్యుంజయహోమాలు,వృద్ధమల్లికార్జునస్వామి ఆర్జితసేవలు తాత్కాలిక నిలిపివేస్తున్నట్లు తెలిపారు అధికారులు.

అంతే కాకుండా 9వ తేదీ నుంచి 11వ తేది మధ్యాహ్నం వరకు స్పర్శ దర్శనాలు నిలిపేసి 11వ తేదీ రాత్రికి శ్రీస్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు అధికారులు.