ఘట్కేసర్: ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైరీ మసాలాలకు కొత్త డేట్స్తో స్టిక్కర్లు

ఘట్కేసర్: ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైరీ మసాలాలకు కొత్త డేట్స్తో స్టిక్కర్లు
  • దిల్ బహార్ మసాలా యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రైడ్స్​

ఘట్కేసర్, వెలుగు: కాలం చెల్లిన మసాలా ప్యాకెట్లపై కొత్త తేదీల స్టిక్కర్లు అతికించి విక్రయానికి సిద్ధం చేస్తుండగా.. ఉప్పల్ జోన్ ఎం-ఫాస్ట్ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. పోచారం ఐటీ కారిడార్ పీఎస్ పరిధిలోని అన్నోజిగూడలో దిల్ బహార్ మసాలా తయారీ యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బుధవారం తనిఖీలు చేపట్టారు. పలు మసాలా ఉత్పత్తులకు సరైన తేదీ లేకపోవడంతోపాటు, ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైరీ డేట్స్​పై తెల్లటి స్టిక్కర్లు అంటించి, కొత్త తేదీలు ముద్రించి ప్యాక్​చేస్తున్నట్లు గుర్తించారు. 

మేనేజర్ షేక్ జహంగీర్, యజమాని షేక్ మహమ్మద్ నబీపై కేసు నమోదు చేశారు. మటన్ బిర్యానీ, చికెన్, మీట్, సబ్జీ మసాలాలు, డ్రై మ్యాంగో పౌడర్, టీ పౌడర్ తదితర ఉత్పత్తులు కలిపి రూ.లక్ష విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.