ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం లభించింది. ఆయన 50 ఏళ్ల సంగీత ప్రస్థానానికి గుర్తింపుగా ఆస్ట్రేలియా పార్లమెంట్ ఆయనను ప్రత్యేకంగా సత్కరించింది. ఇళయరాజా చిత్రంతో కూడిన ప్రత్యేక పోస్టల్ స్టాంపులను ఈ సందర్భంగా విడుదల చేసింది.
విక్టోరియా ఫైనాన్స్ మినిస్టర్ ఎన్వర్ ఎర్డోగన్ ఈ స్టాంపులను ఆవిష్కరించారు. పలువురు పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తనకు దక్కిన గొప్ప గౌరవంగా దీన్ని భావిస్తున్నట్టు హర్షం వ్యక్తం చేసిన ఇళయారాజా.. తాను పార్లమెంటులో మాట్లాడుతున్న ప్రసంగ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
తమిళనాడులోని ఒక చిన్న, మారుమూల గ్రామంలో జన్మించిన తాను, ఆస్ట్రేలియన్ పార్లమెంట్‌లో గౌరవాన్ని అందుకోవడం హృదయానికి హత్తుకునేలా ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనకు సపోర్ట్ చేసిన కళాకారులకు, ఆదరించిన శ్రోతలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు.
I offer my sincere gratitude to the Honorable Enver Erdogan MP, Minister for Finance, Victorian Government, and the Members of Parliament for having my 50-year journey commemorated through a ceremonial stamp release. Being born in a small, remote village in Tamil Nadu and honored… pic.twitter.com/QXl4yQZURi
— Ilaiyaraaja (@ilaiyaraaja) September 22, 2026
