10వ రోజు వేల సంఖ్యలో నిమజ్జనాలు..నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ వైపు తీవ్ర రద్దీ

10వ రోజు వేల సంఖ్యలో నిమజ్జనాలు..నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ వైపు తీవ్ర రద్దీ
  •     ట్యాంక్ బండ్ పై 15  క్రేన్ల ఏర్పాటు  

ట్యాంక్ బండ్, వెలుగు: వినాయక చవితి పదో రోజు నిమజ్జనానికి భారీగా గణనాథులు తరలివచ్చాయి. బుధవారం ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ లో వేల సంఖ్యలో వినాయక విగ్రహాలు రావడంతో తీవ్రమైన రద్దీ నెలకొంది. గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. 

మరోవైపు అధికారులు ట్యాంక్ బండ్ పైనా 15 క్రేన్ల ఏర్పాటు చేశారు.  బుధవారం నుంచే నిమజ్జనాలు కూడా మొదలుపెట్టడంతో స్పీడ్ అందుకుంది. ఎన్టీఆర్ మార్గ్ లో 10, పీవీ మార్గ్ లోని పీపుల్స్ ప్లాజాలో 9  క్రేన్లతో నిమజ్జనం కొనసాగిస్తున్నారు. అలాగే, వీటికి తోడు గార్డెన్ పాయింట్లు, బేబీ పాండ్స్ కూడా ఏర్పాటు చేశారు.