కౌడిపల్లి: ధాన్యం కొనుగోలు అవకతవకలు...19 మంది రైతులకు నోటీసులు

కౌడిపల్లి: ధాన్యం కొనుగోలు అవకతవకలు...19 మంది రైతులకు నోటీసులు

కౌడిపల్లి, వెలుగు:  మెదక్​ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ సొసైటీ పరిధిలోని కౌడిపల్లి పీఏసీఎస్​ ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరిగిన  అవకతవకల విషయంలో బుధవారం  కౌడిపల్లి, మహమ్మద్ నగర్ గ్రామాలకు చెందిన 19 మంది రైతులకు నోటీసులు ఇచ్చినట్లు సంబంధిత అధికారి ప్రకాశ్​ తెలిపారు. 

ఆయా రైతుల పేర్ల మీద ఎంత భూమి ఉంది? వారి అకౌంట్లో ఎంత అమౌంట్​ జమ అయ్యింది అనే వివరాలపై ఈనెల 29న మహమ్మద్ నగర్ పీఏసీఎస్​ కార్యాలయంలో ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చి రైతులతో ముఖాముఖి చర్చిస్తారని తెలిపారు. నోటీసులు ఇచ్చిన రైతులు ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్, బ్యాంక్ అకౌంట్ తీసుకుని సొసైటీకి రావాలని సూచించారు.