జలమండలి కార్మికులకు అండగా ప్రభుత్వం

జలమండలి కార్మికులకు అండగా ప్రభుత్వం
  •     ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ 
  •     తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ ఆఫీస్​ ప్రారంభం 

గోషామహల్/ఓల్డ్​సిటీ, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ, కార్మిక పక్షపాతి అని, వారి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తుందని ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. గోషామహల్ లో జల మండలి గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ జల మండలి ఎంప్లాయిస్ యూనియన్ ఆఫీస్​ను సంఘం అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చక్రధర్ రెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోటి మంది కార్మికులకు కనీస వేతనాలను అమలులోకి తీసుకువచ్చిందని చెప్పారు. 

జలమండలి కార్మికులకు అండగా ఉంటుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కాంగ్రెస్ తోనే సాధ్యమని, త్వరలో జరగనున్న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో పార్టీ బలపరుస్తున్న  తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి ఈ.అశ్వత్థామ రెడ్డి, ప్రధాన కార్యదర్శి టీటీ రాఘవేంద్రరాజ్, అసోసియేట్ ప్రెసిడెంట్లు అల్లి శ్రవణ్ కుమార్, ఎండీ.జహంగీర్, నాయకులు పాల్గొన్నారు.